ఆంధ్రప్రదేశ్‌

పెండింగ్ ప్రాజెక్ట్‌లు సత్వరం పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోని సాగునీటి సమస్యలపై అధికారులు తక్షణం స్పందించాలని రెండు జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు కోరారు. పెండింగ్‌లో వున్న సాగునీటి ప్రాజెక్ట్‌లు, డిస్ట్రిబ్యూటరీ కాలువ పనులను సత్వరం పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గాల వారీగా వున్న సాగు, మంచినీటి సమస్యలను మంత్రులు, అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. విజయవాడలోని ఇరిగేషన్ కార్యాలయంలో సోమవారం అనంతపురం, చిత్తూరు జిల్లాలకు సంబంధించిన సాగునీటి ప్రాజెక్ట్‌లపై సోమవారం ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. రాష్ట్ర ఇరిగేషన్ శాఖామంత్రి అనిల్‌కుమార్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, శంకర్ నారాయణ, చీఫ్‌విప్ జి శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు. రెండు జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇరిగేషన్ అధికారుల సమక్షంలో తమ నియోజకవర్గంలోని సాగునీటి అవసరాలు, చేపట్టాల్సిన పనులపై ప్రజాప్రతినిధులు వివరించారు. ప్రధానంగా అనంతపురం జిల్లాలో చెరువులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి వుందని, ఈ నేపథ్యంలో చెరువులకు నీటిని అందించాలని, అదే సమయంలో డిస్ట్రిబ్యూటరీ కాలువలకు కూడా నీరు విడదల చేయడం ద్వారా ఆయకట్టును కాపాడాలని ప్రజాప్రతినిధులు కోరారు. అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 3.45 లక్షల ఎకరాల ఆయకట్టుకు, నాలుగు వందల చెరువులకు నీటిని ఇవ్వాలని దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రతిపాదించారని గుర్తు చేశారు. సింగనమల ఎమ్మల్యే జొన్నలగడ్డ పద్మావతి మాట్లాడుతూ తమ జిల్లాకు గతంలో 32.5 టీఎంసీల నీరు తుంగభద్ర నుంచి కేటాయించగా, ఇప్పుడు పది టీఎంసీలు తగ్గిపోయిందని అన్నారు. కదిరి ఎమ్మెల్యే పీవీ సిద్ధారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో వున్న మొత్తం 380 చెరువులను నింపేందుకు సాగునీరు విడుదల చేయాలని కోరారు. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ చిత్రావతి నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నియోజకవర్గంలోని చెరువులను నింపాలని కోరారు. అనంతపురం ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ నియోజకవర్గాలకు వచ్చే నీటిని లెక్కించే ప్రక్రియ చేపట్టాలని, దాని ద్వారా వాటర్ మేనేజ్‌మెంట్ చేయవచ్చని అన్నారు. ఎమ్మెల్యే శ్రీ్ధర్‌రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని 201 చెరువులకు మూడు టీఎంసీల నీరు అవసరమని అన్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గం కేవీ ఉషాశ్రీ చరణ్ మాట్లాడుతూ జీడిపల్లి రిజర్వాయర్ నుంచి కళ్యాణదర్గంకు పనె్నండు కిలోమీటర్ల దూరమే అయినా తమకు రిజర్వాయర్ నుంచి సాగునీరు అందడం లేదన్నారు. ఎమ్మెల్యే తిప్పేస్వామి మాట్లాడుతూ సముద్ర మట్టానికి ఏడు వందల మీటర్ల ఎత్తులో తమ ప్రాంతం వుందని అన్నారు. జిల్లా మంత్రి శంకర్ నారాయణ మాట్లాడుతూ పెనుగొండ నియోజకవర్గంలో హెచ్‌ఎన్‌ఎస్ కింద కేవలం ముప్పైవేల ఎకరాల ఆయకట్టు మాత్రమే వుందని, దీనిని పెంచాలని కోరారు.
సాగునీటి ప్రాజెక్ట్‌లపై జరిగిన సమీక్షా సమావేశంలో చిత్తూరుజిల్లాకు సంబంధించి రాష్ట్ర పంచాయతీరజ్, గ్రామీణాభివృద్ధి శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పలు సూచనలు చేశారు. చెర్లోపల్లి రిజర్వాయర్ నుంచి చిత్తూరుజిల్లా సాగునీటి అవసరాలకు నీటిని అందించాలని కోరారు.
*చిత్రం...సాగునీటి ప్రాజెక్ట్‌లపై సోమవారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రులు