ఆంధ్రప్రదేశ్‌

అక్రమ కేసులను అడ్డుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం (టౌన్), అక్టోబర్ 22: అధికారం చేతిలో ఉంది కదా అని ప్రతిపక్షాన్ని వైసీపీ అణగదొక్కాలని చూస్తే ఊరుకునేది లేదని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు హెచ్చరించారు. టీడీపీ వర్గాలను భయభ్రాంతులను చేస్తూనాలుగు నెలల కాలంలో 86 మందిపై అక్రమగా 12 కేసులు నమోదు చేయడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఇక్కడి ఎన్టీఆర్ భవన్‌లో జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో రెండో రోజు మంగళవారం టీడీపీ కార్యకర్తలు, నేతలపై జిల్లాలో వైసీపీ దాడులపై ఆయన బాధితులను అడిగి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలాస నియోజక వర్గం మందస మండలం లింబుగాం గ్రామానికి చెందిన తలగాని రాజశేఖర్‌పై వైసీపీ ఎమ్మెల్యే తనపై ఫేస్‌బుక్‌లో తప్పుడు పోస్టు పెట్టారని కేసు పెట్టగా, దీనిపై సీఐ, డీఎస్పీలు రాజశేఖర్‌కు రెండురోజులు కౌన్సిలింగ్ ఇచ్చి మళ్లీ రమ్మని చెప్పారని, ఇంతలో అతనిపై ఏడుగురు వైసీపీ కార్యకర్తలు దాడి చేశారన్నారు. దీనిపై రాజశేఖర్ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేయకపోగా ఇరువర్గాల మీద ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయలేదని తెలిపారు. శ్రీకాకుళం నియోజకవర్గం కుందువానిపేటకు చెందిన సూరాడ అప్పన్నపై వైసీపీ నాయకులు సూరాడ సూర్యం, రామారావు, దాసరి కామరాజు, రాయత్తు మల్లేశ్ దాడి చేయగా ఇరువర్గాలు కేసు పెట్టేందుకు ప్రయత్నించగా టీడీపీ నాయకుల కేసు పోలీసులు నమోదు చేయకపోగా తిరిగి వారినే భయపెట్టి రాజీ చేశారన్నారు. ఆమదాలవలస మాజీ శాసన సభ్యుడు కూన రవికుమార్‌తో పాటు మరో 12 మందిపై ఎంపీడీవో కార్యాలయానికి వెళ్లి పనులు చేయకుండా అడ్డుకుంటున్నారని ఇల్లీగల్ కేసు నమోదు చేశారన్నారు. టెక్కలి శాసన సభ్యుడు కింజరాపు అచ్చెన్నాయుడుపై టెక్కలి మండలం చాకిపల్లి పంచాయతీలో 224 పెన్షన్‌లుండగా వాటిలో 22 పెన్షన్‌లు టీడీపీకి చెందినవని తొలగించి వలంటీర్లు పెన్షన్ ఇవ్వలేదని, దీనిపై టీడీపీ కార్యకర్తలు పి.వసంతకుమార్, తవిటయ్య, టి.్భస్కర్, పి.పాపమ్మ, పి.పెంటయ్య వలంటీర్లను ప్రశ్నించగా ఘర్షణలో ముగ్గురు వలంటీర్లు టీడీపీ నేతలపై కేసు పెట్టారని, దీనిపై టెక్కలి ఎమ్మెల్యే అక్కడకు చేరుకొని ధర్నా నిర్వహించగా మరుసటి రోజు ఉదయం ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును హౌస్ అరెస్ట్ చేశారన్నారు. పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలం కుంటిభద్ర గ్రామానికి చెందిన మాజీ వైస్ ఎంపీపీ, సీనియర్ టీడీపీ నాయకులు బైరాగినాయుడుపై ఊరిలో వేరేవారు కొట్టుకోవడంలో జరిగిన హత్యానేరం మోపారన్నారు. పాతపట్నం మాజీ శాసన సభ్యుడు కలమట వెంకటరమణ పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలం మాతల గ్రామ పంచాయతీ పరిథిలో గల సామాజిక భవనానికి వైసీపీ రంగులు వేయడంపై నల్ల రిబ్బన్లతో నిరసన తెలిపినందుకు వెంకటరమణతోపాటు 18 మందిని పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. అధికార వైసీపీ పార్టీ టీడీపీ నాయకులు, నేతలపై పెడుతున్న అక్రమ కేసులపై సమగ్ర విచారణ జరిపించాలన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ భ్రష్టుపట్టించిన ఘనత జగన్‌కే దక్కిందన్నారు. ప్రభుత్వం శాశ్వతం కాదనే విషయాన్ని పోలీస్ వర్గాలు గమనించాలని, తమ నాయకులు, కార్యకర్తలపై పెట్టిన కేసులపై తాముకూడా కౌంటర్, ప్రైవేట్ కేసులు నమోదు చేసి నిపుణులైన న్యాయవాదులతో ఎదుర్కొంటామని కార్యకర్తలకు, నేతలకు చంద్రబాబు భరోసా ఇచ్చారు.
*చిత్రం... చంద్రబాబు వద్ద తన ఆవేదన వివరిస్తున్న బాధితుడు