ఆంధ్రప్రదేశ్‌

‘హోదా’ను గాలికి వదిలేశారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 22: రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం అధికార, ప్రతిపక్షాలు ఎందుకు పోరాడట్లేదని హోదా, విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ ప్రశ్నించారు. విశాఖలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విపక్షంలో ఉండగా వైసీపీ ప్రత్యేక హోదా సాధించేందుకు 25 మంది ఎంపీలను ఇవ్వాలని కోరిందని, ప్రజలు కూడా మన్నించి 22 మంది వైసీపీ ఎంపీలను గెలిపించారన్నారు. అధికారంలోకి వచ్చిననాటి నుంచి వైసీపీ ప్రత్యేక హోదాపై కనీసం స్పందించలేదని ఆరోపించారు.
ఇక విపక్ష టీడీపీ కూడా ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ఎన్నికల ముందు కేంద్రాన్ని, మోదీని నిలదీసిందని, ఇప్పుడు మాత్రం హోదా ఊసెత్తకపోవడం అంతరార్ధం ఏమిటని ప్రశ్నించారు. కేంద్రంతో విరోధించమని తాము చెప్పడం లేదని, ఇప్పుడు హోదా, విభజన హామీలు సాధించుకోపోతే భవిష్యత్‌లో మరిన్ని చిక్కులు ఎదుర్కొనాల్సి ఉంటుందన్నారు. హామీలు అమలు కాకపోతే వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ఒక్క రూపాయి కూడా రాదన్నారు. విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ త్వరితగతిన ప్రారంభం కావాల్సి ఉందన్నారు. రానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఈ అంశంపై ఎంపీలు కేంద్రాన్ని గట్టిగా నిలదీయాలని సూచించారు. ఈ ఏడాది ఏపీకి రూ.60 వేల కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉందని, దీనిపై దృష్టి పెట్టాలన్నారు. ఇక తెలుగు రాష్ట్రాల బ్యాంకుగా వెలుగొందిన ఆంధ్రాబ్యాంకును వేరే బ్యాంకులో విలీనం చేయడం సరికాదన్నారు. ఈ అంశాలపై అధికార, విపక్షాలు సరైన రీతిలో స్పందించాలన్నారు. లేనిపక్షంలో జనవరి తరువాత సమితి ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామన్నారు.
*చిత్రం... విలేఖరులతో మాట్లాడుతున్న ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్