ఆంధ్రప్రదేశ్‌

స్వయం ఉపాధికి ‘వైఎస్సార్ ఆదర్శం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ‘వైఎస్సార్ ఆదర్శం’ పేరుతో నూతన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. ఈ పథకం కింద 6000 ట్రక్కులను కొనుగోలు చేసేందుకు వీలుగా బ్యాంక్ లింకేజీకి ఏర్పాట్లు చేస్తోంది. ఇసుక రవాణా చేసేందుకు వీలుగా రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ, మద్యాన్ని రవాణా చేసేందుకు ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్, రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ, తదితర ప్రభుత్వ సంస్థలు ఈ ట్రక్కుల సేవలు వినియోగించుకుంటాయి. ఇసుక, తదితర అత్యవసర సరకుల రవాణాలో ఎదుర్కొంటున్న సమస్యలు అధిగమించే లక్ష్యంగా ఈ పథకం కింద ట్రక్కులను భారీ సంఖ్యలో కొనుగోలు చేసేలా ఏర్పాట్లు చేస్తోంది. వివిధ సంక్షేమ శాఖల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఖనిజాభివృద్ధి సంస్థ ఈ ట్రక్కుల ద్వారా ఇసుక సరఫరా చేస్తుంది. ట్రక్కు యజమానులకు ఆయా సంక్షేమ శాఖల ద్వారా చెల్లింపులు చేస్తారు. ట్రక్కు లబ్ధిదారునికి కనీసం నెలకు రూ.20 వేల ఆదాయం లభించేలా ఈ పథకాన్ని రూపొందిస్తున్నారు. ఐదేళ్ల తరువాత లబ్ధిదారుడు ఆ వాహనానికి యజమానిగా మారతాడు. సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి అధ్యక్షతన వివిధ శాఖల నుంచి ఏడు మంది అధికారులతో రాష్ట్ర స్థాయి కమిటీ ఈ పథకాన్ని పర్యవేక్షిస్తుంది. జిల్లాలో కలెక్టర్ అధ్యక్షతన వివిధ సంక్షేమ శాఖల అధికారులతో ఈ పథకాన్ని పర్యవేక్షిస్తారు.