ఆంధ్రప్రదేశ్‌

నిబంధనలు పాటించని కళాశాలలను గుర్తించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 22: నిబంధనలు పాటించకుండా విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న కళాశాలలను గుర్తించాలని అగ్నిమాపక శాఖ అధికారులను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో అగ్నిమాపక శాఖ అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలు, కళాశాలల్లో అగ్నిప్రమాద నివారణకు నిబంధనల మేరకు ఉండాల్సిన ఏర్పాట్లు ఉన్నాయా లేవా అన్న అంశాన్ని పరిశీలించాలన్నారు. ఇచ్చిన అనుమతులు, అక్కడ ఉన్న వాస్తవ పరిస్థితులను పరిశీలించాలన్నారు. ఇప్పటికే పాఠశాల, కళాశాల విద్యా సంస్కరణల్లో భాగంగా ప్రైవేట్ కళాశాలల్లోని దారుణ పరిస్థితులను గుర్తించామన్నారరు. విద్యార్థుల భద్రత పట్ల నిర్లక్ష్యంగా ఉన్న కళాశాలల యాజమాన్యాలను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. చాలా చోట్ల అనుమతులు తీసుకునే సమయంలో రెసిడెన్సు అని చెప్పి, ఆ తరువాత కళాశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు గుర్తించామన్నారు. ఫైర్ సేఫ్టీకి అన్ని కళాశాలల్లో నిబంధన మేరకు ఎమేమి ఉండాలో అవన్నీ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇప్పటికే కళాశాల విద్యాధికారులు తనిఖీలు ముమ్మరం చేశారని, అగ్నిమాపక శాఖ కూడా సర్ట్ఫికెట్ల జారీలో జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. విద్యా రంగంలో తీసుకువస్తున్న మార్పులకు అధికారులు కూడా బాధ్యతగా వ్యవహరించాలన్నారు. ఈ సమావేశంలో విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజశేఖర్, అగ్నిమాపక శాఖ డీజీపీ అనూరాధ, ఇంటర్మీడియట్ విద్యా కమిషనర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.