ఆంధ్రప్రదేశ్‌

బిజెపి రాష్ట్ర పదాధికారుల సమావేశంలో నేతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 3: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంపై అన్ని స్థాయిల్లోను తర్జన భర్జన జరుగుతున్న నేపధ్యంలో శనివారం నగరంలో జరిగిన బిజెపి రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, ఇన్‌ఛార్జిల సమావేశంలో పాల్గొన్న పార్టీ జాతీయ కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి సిద్ధార్థనాథ్‌సింగ్ మాత్రం ప్రత్యేక హోదా లేనట్లేనని స్పష్టం చేసినట్లు తెలియవచ్చింది. మరో జాతీయ కార్యదర్శి అరుణ్‌సింగ్ కూడా పాల్గొన్నారు. సమావేశం అనంతరం వివరాలను మహిళామోర్చా జాతీయ ఇన్‌చార్జి, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధ్రేశ్వరితోపాటు శాసనసభ్యులు విష్ణుకుమార్‌రాజు మీడియాకు వెల్లడించారు.
రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు కార్యకర్తల మనోభావాలు తెలుసుకోటానికి రాష్ట్ర నాయకులు ఇక విస్తృతంగా పర్యటించేందుకు గాను దశ, దిశ నిర్దేశం చేసేందుకు విచ్చేసిన జాతీయ నాయకులు ప్రత్యేక హోదా విషయంలో ప్రత్యేకంగా మాట్లాడారు. ఏపిని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రాష్ట్రంగా పరిగణిస్తున్నందున అభివృద్ధికి పూర్తి సహకారం అందించటం తమ బాధ్యతగా జాతీయ నాయకులు స్పష్టం చేశారు. 14వ ఆర్ధిక సంఘం అమలు తరువాత కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వాలు భరించడమనేది అర్ధం లేకుండా పోయిందన్నారు.
అయితే ఆర్ధిక ఇబ్బందుల్లో వుండి ప్రత్యేక హోదా కోరుతున్న 11 రాష్ట్రాలకు అదనపు సహాయం చేసేందుకు కేంద్రం నిర్ణయించుకుందని ఇందులో ఎపి కూడా వుందని వారు స్పష్టం చేశారు. కేంద్రం ఇస్తున్న నిధులకు ఎప్పటికప్పుడు యుటిలైజేషన్ సర్ట్ఫికెట్లు అందజేసిన తరువాతే మిగిలిన నిధులను పంపడం జరుగుతుందని పురంధ్రేశ్వరి స్పష్టం చేశారు. ఖాతాలో ఆడిట్ వ్యవహారాల పరిశీలన తరువాత రాష్ట్ర ఆర్ధిక లోటును కేంద్రం తప్పక చెల్లిస్తుందని చెప్పారు. అయినప్పటికీ 2015-16కు సంబంధించి రూ.4వేల కోట్లను కేంద్రం చెల్లించిందని చెప్పారు. పోలవరం నిర్మాణ వ్యయం బిల్లులను సకాలంలో అందించి అధార్టీని సంతృప్తిపరిస్తే వెంటనే కేంద్రం మంజూరు చేస్తుందన్నారు. ఏడు వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ఇప్పటికి రెండు విడతలుగా రూ.700 కోట్లు చెల్లించామని అయితే వీటికి నేటివరకు యుటిలైజేషన్ సర్ట్ఫికెట్లు రాలేదన్నారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డా.కంభంపాటి హరిబాబు, ఎంపి గోకరాజు గంగరాజు, మంత్రి మాణిక్యాలరావు, మాజీ మంత్రులు కావూరి సాంబశివరావు, కన్నా లక్ష్మీనారాయణ, పార్టీ అనుబంధ సంస్థల నాయకులు తదితరులు పాల్గొన్నారు.