ఆంధ్రప్రదేశ్‌

గణేష్ ఉత్సవాల్లో విషాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు/త్రిపురాంతకం, సెప్టెంబర్ 6: వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా జరిగిన రెండు వేర్వేరు సంఘటనల్లో నలుగురు మృతి చెందారు. గణేష్ ప్రతిమ నిలిపేందుకు చేస్తున్న ఏర్పాట్లలో విద్యుదాఘాతానికి గురై ఇద్దరు మృత్యువాత పడిన సంఘటన నెల్లూరు జిల్లా కోవూరు మండలం ఇనమడుగులో చోటుచేసుకుంది. శ్రీ రాజరాజేశ్వరి ఐస్ ఫ్యాక్టరీలో పనిచేసే సిబ్బంది తమ ఫ్యాక్టరీ ఆవరణలో వినాయకచవితిని పురస్కరించుకుని విగ్రహం ఏర్పాటుకు సిద్ధమయ్యారు. సోమవారం తెల్లవారుజామున మండపం ఏర్పాటుకు ఇనుప గుంజలను పాతే సమయంలో 11 కెవి విద్యుత్ వైరు తగలడంతో రామకృష్ణ, పార్వతయ్య, సుబ్రహ్మణ్యం విద్యుదాఘాతానికి గురయ్యారు. వీరిలో పార్వతయ్య అక్కడికక్కడే మరణించాడు. ఫ్యాక్టరీలో మిగతా కార్మికులు వీరిని ఆసుపత్రికి తరలించగా రామకృష్ణ చికిత్స పొందుతూ మరణించాడు. సుబ్రమణ్యం పరిస్థితి కూడా విషమంగా ఉంది. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలోని కంకణాలపల్లి గ్రామశివారులో వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం చెరువులో దిగిన బైలడుగు చిన్నయోగయ్య (24), బైలడుగు వీరాంజనేయులు (15) మృతి చెందారు. ఇటీవల కంకణాలపల్లి చెరువులో పూడికతీశారు. పెద్దపెద్ద గుంతలు ఉండటంతో వారిద్దరు గుంతలో చిక్కుకుని మృతి చెందారు.
నీటమునిగి తండ్రీకూతుళ్ల మృతి
పరిగి: అనంతపురం జిల్లా పరిగి మండలం కొడిగెనహళ్లిలో సోమవారం గణేష్ నిమజ్జనం సందర్భంగా అపశృతి చోటుచేసుకుంది. గణపతి విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు వెళ్లిన తండ్రీకూతుళ్లు నీట మునిగి మృతి చెందారు. కొడుకు ప్రాణాలతో బయటపడ్డాడు.