ఆంధ్రప్రదేశ్‌

ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, మార్చి 25: చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు జన మిలీషియా కమాండర్ సుధ్రం మృతి చెందాడు. కొండగావ్ జిల్లా మర్ధపాల్ పోలీసు స్టేషన్ పరిధిలోని రాకస్‌మెట్ట- కుజూర్ అటవీ ప్రాంతంలో డిఆర్‌జీ, మర్ధపాల్ పోలీసులు ఎస్సీ జెఎస్ వట్టి ఆధ్వర్యంలో కూంబింగ్ నిర్వహించారు. పోలీసు బలగాలను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు అంబూష్ చేయగా వాటిని జవాన్లు తిప్పికొట్టారు. హోరాహోరీగా కాల్పులు జరిగాయి. కాల్పుల అనంతరం మావోయిస్టులు పారిపోగా సంఘటన ప్రదేశంలో సుధ్రం మృతదేహం లభించింది. టిఫిన్ బాంబ్, బర్మార్ తుపాకీ, విప్లవ సాహిత్యం, ఇతర సామాగ్రి లభ్యమయ్యాయి. సుధ్రం అలియాస్ లిబ్రూ స్వగ్రామం మర్ధపాల్ పోలీసుస్టేషన్ పరిధిలోని కుదూర్. ఇతనిపై 7 కేసులు ఉన్నాయి. 23 అరెస్టు వారెంట్లు సైతం ఉన్నట్లు బస్తర్ ఐజీ కల్లూరి తెలిపారు. మర్ధపాల్, కొండగావ్, మర్దూమ్, జగ్దల్‌పూర్ ప్రాంతాల్లో ఈ జన మిలీషీయా కమాండర్ అనేక హింసాత్మక సంఘటనల్లో పాల్గొన్నట్లు ఐజీ తెలిపారు.