ఆంధ్రప్రదేశ్‌

విశాఖలో భారీ గణనాథులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 6: విశాఖ ఎంవిపి కాలనీలో భారీ గణనాథుడు కొలువు తీరాడు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న గణపతి ఉత్సవాల్లో భాగంగా మహా గణపతి యువజన సేవా సంఘం ఆధ్వర్యంలో 108 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. చవితి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ భారీ గణనాథుని రూపకల్పన కూడా ఘనంగానే జరిగింది. విశాఖ రూరల్ పరిధి అనకాపల్లిలో ఈ విగ్రహాన్ని భాగాలుగా తయారు చేసి, ఎంవిపిలోని ఎఎస్ రాజ కళాశాల మైదానంలో నెలకొల్పారు. వినాయక చవితి తొలి రోజున వేలాది మంది భక్తులు భారీ వినాయకుని దర్శించుకున్నారు. తొమ్మిది రోజుల పాటు నిర్వహించే నవరాత్రుల్లో లక్షకు పైగా భక్తులు ఈ భారీ గణనాథుని దర్శించుకుంటారని నిర్వాహకులు పేర్కొంటున్నారు.

చిత్రాలు.. ఎంవిపి కాలనీలో 108 అడుగుల గణపతి
గాజువాకలో 78 అడుగుల వినాయకుడు