ఆంధ్రప్రదేశ్‌

3నెలల్లో మహిళా కమిషన్ బలోపేతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, మార్చి 25: రానున్న మూడు నెలల్లో రాష్ట్ర మహిళా కమిషన్‌ను బలోపేతం చేయడానికి చర్యలు చేపడతామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ నన్నపనేని రాజకుమారి తెలిపారు. శుక్రవారం స్థానిక పద్మావతి అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మహిళ సంక్షేమం, రక్షణ నిమిత్తం తప్పనిసరిగా స్టాండింగ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. అత్యాచారాలు, ఇతర నేరాలపై కేసులు సత్వర పరిష్కారానికి ఫాస్ట్‌ట్రాక్ కోర్టులకను ఏర్పాటు చేయడానికి చర్యలు చేపడుతున్నామన్నారు. మహిళలు, ఆడపిల్లలపై ఈవ్ టీజింగ్, ర్యాగింగ్, వేధింపులు నిరోధానికి ప్రత్యేక పోలీసు బృందాలు అభయం యాప్ ద్వారా 15నిమిషాల్లో రక్షణ కల్పించేలా చర్యలు చేపట్టడతామన్నారు.

మాజీ మంత్రి కాసుకు స్వల్ప అస్వస్థత
నరసరావుపేట, మార్చి 25: పీసీసీ క్రమశిక్షణా సంఘం చైర్మన్, మాజీ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ మర్రి పెద్దయ్య, డాక్టర్ గార్లపాటి కృష్ణకాంత్, డాక్టర్ అచ్యుతబాబు తదితరులు కాసుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. గ్యాస్ ప్రాబ్లమ్ వల్ల హృదయానికి తీవ్రమైన వత్తిడి కలిగిందని వైద్యులు మర్రి పెద్దయ్య తెలిపారు. ప్రస్తుతం ఆరోగ్యం బాగానే ఉందని వివరించారు. కాసుకు ఆరోగ్య పరిస్థితి బాగాలేదని తెలుసుకున్న పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనను చూసేందుకు భారీగా తరలివచ్చారు. సాయంత్రం ఆయన హైదరాబాద్‌కు వెళ్ళారు. హైదరాబాద్‌లోని కేర్ ఆసుపత్రిలో డాక్టర్ సోమనాధ్‌చే వైద్య పరీక్షలు చేయించుకోనున్నారని ఆయన క్యాంప్ కార్యాలయం సిబ్బంది తెలిపారు.