ఆంధ్రప్రదేశ్‌

ఎలా స్వాగతిస్తావు బాబూ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 8:్ఢల్లీలో కేంద్రం, రాష్ట్రంలో చంద్రబాబు కలిసి లక్షలాది యువకుల ఉజ్వల భవిష్యత్తును నాశనం చేశారని విపక్ష నేత జగన్ ధ్వజమెత్తారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే తమ బతుకులు బాగుపడతాయని యువత ఆశించిందని, వారి ఆశలపై అటు కేంద్రం, ఇటు చంద్రబాబు కూడా నీళ్లు చల్లారని ఆయన ఆరోపించారు. ఐదు కోట్ల మంది ఆంధ్రుల భవిష్యత్తును అయోమయంలో పడేశారన్నారు. చంద్రబాబుకు ఏ మాత్రం అభిమానం ఉన్నా, కేంద్రం వైఖరికి నిరసనగా తన పదవికి రాజీనామా చేయాలని, కేంద్ర మంత్రివర్గంలో ఉన్న ఇద్దరు మంత్రుల చేత రాజీనామా చేయించాలని జగన్ డిమాండ్ చేశారు. కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని టిడిపి ప్రభుత్వాల వైఖరికి నిరసనగా ఈ నెల 10న రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. హోదా కావాలనుకునే అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు బంద్‌కు మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.
గురువారం జగన్ ఆధ్వర్యంలో వైకాపా ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఎదుట ఉన్న టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాల వేసి అసెంబ్లీ వరకు ర్యాలీ నిర్వహించారు. కేంద్రం వైఖరికి నిరసనగా ఎమ్మెల్యేలు నల్ల చొక్కా ధరించారు. ఈ సందర్భంగా జగన్ విలేఖర్లతో మాట్లాడుతూ హోదాపై రాజీలేదని, వైకాపాతో కలిసి వచ్చే అన్ని పక్షాలను కలుపుకుని లక్ష్యసాధనకు పోరాటానికి సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర విభజనలో భాగస్వామి అయిన బిజెపి పార్లమెంటు వేదికగా తాము అధికారంలోకి వస్తే పదేళ్లపాటు ఏపికి ప్రత్యేక హోదా ఇస్తామని మాట ఇచ్చి తుంగలో తొక్కారన్నారు. కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల చెవుల్లో క్యాబేజీ పువ్వు పెట్టారన్నారు. హోదా ఇస్తామని ఓట్లు కొల్లగొట్టుకుని ఈ రోజు ప్యాకేజీకి చంద్రబాబు అంగీకరించడాన్ని ప్రజలు క్షమించరన్నారు.
బాబు రక్తం మరగడం లేదా?
గతంలో కేంద్రం హోదాపై చేసిన ప్రకటన విని రక్తం మరిగిందని చంద్రబాబు వ్యాఖ్యానించారని, మరి ఇప్పుడేమయిందని, జైట్లీ చేసిన ప్రకటనతో బాబు రక్తం మురిగిపోయిందా అని జగన్ ఎద్దేవా చేశారు. ఓటుకు నోటు కేసులో బయడపడేందుకు ఆంధ్ర రాష్ట్రాన్ని చంద్రబాబు అమ్మేశారన్నారు. అనంతరం జగన్ అసెంబ్లీలోనూ హోదా ప్రస్తావన తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. హోదా ఇవ్వబోమని జైట్లీ ప్రకటిస్తే, దానిని స్వాగతిస్తున్నామని చంద్రబాబు ఎలా అంటారని ఆయన సభాముఖంగా నిలదీశారు. జగన్ వ్యాఖ్యలపై అధికార పక్షం సభ్యులు ధ్వజమెత్తారు. దీంతో సభలో గలభా నెలకొంది. ఈ నేపథ్యంలో స్పీకర్ జగన్ మైక్‌ను కట్ చేశారు.