తెలంగాణ

అగ్రిగోల్డ్ బాధితులందరికీ న్యాయం చేస్తాం: బొత్స

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, నవంబర్ 7: అగ్రిగోల్డ్ బాధితులు అందరికీ న్యాయం చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ హామీ ఇచ్చారు. గురువారం ఇక్కడి ఆనందగజపతి ఆడిటోరియంలో అగ్రిగోల్డ్ బాధితులతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల కోసం ఏం చేయడానికైనా తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సామాన్యులకు ప్రభుత్వం అండగా ఉండాలనే భరోసా ఇస్తుందన్నారు. అగ్రిగోల్డ్ అనేది ఓ ప్రైవేటు సంస్థ. గత ప్రభుత్వ హయాంలో బోర్డు తిప్పేసింది. ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పాదయాత్రలో అగ్రిగోల్డ్ డిపాజిట్‌దారులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు బడ్జెట్‌లో రూ.1180 కోట్లు కేటాయించారు. అందులో తొలి విడతగా రూ.10వేల లోపు డిపాజిట్‌దారుల ఖాతాల్లోకి ఆ మొత్తాన్ని గురువారం జమ చేశారని అన్నారు. జిల్లాలో 56వేల మంది అగ్రిగోల్డ్ బాధితులు ఉండగా వారిలో తొలి విడతగా 32వేల మంది డిపాజిట్‌దారులకు రూ.36.9 కోట్ల రూపాయలు జమ చేశారని వివరించారు. ఈ సందర్భంగా అగ్రిగోల్డ్ బాధితులు, మరుపల్లి, ద్వారపూడి గ్రామాలకు చెందిన వారు మాట్లాడుతూ తమ సొమ్ము మళ్లీ తమకు అందుతుందని అనుకోలేదన్నారు. సమావేశానికి ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి అధ్యక్షత వహించారు. కలెక్టర్ హరి జవహర్‌లాల్, ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు బడ్డుకొండ అప్పలనాయుడు, శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, బొత్స అప్పలనర్సయ్య, కడుబండి శ్రీనివాసరావు, పెద్ద సంఖ్యలో అగ్రిగోల్డ్ బాధితులు పాల్గొన్నారు.
*చిత్రం... కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి బొత్స సత్యనారాయణ