ఆంధ్రప్రదేశ్‌

తప్పుడు కేసుల ఆరోపణలు అవాస్తవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, నవంబర్ 8: రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి పూర్తిస్థాయిలో రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీస్ శాఖపై ఉందని, అందుకే తమ అధికారులు అవసరమైన చోట్ల ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకున్నారని తిరుపతి అర్బన్ ఎస్పీ డాక్టర్ గజరావు భూపాల్ వెల్లడించారు. పోలీసులు బాధ్యతారాహిత్యంగా, తప్పుడు కేసులు పెడుతూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, కోర్టులో ప్రైవేట్ కేసులు వేయాలని కార్యకర్తలతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మూడు రోజుల చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా వ్యాఖ్యలు చేసిన విషయం పాఠకులకు విదితమే. ఈక్రమంలో శుక్రవారం అర్బన్ జిల్లా ఎస్పీ డాక్టర్ గజరావు భూపాల్ తన కార్యాలయంలో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసుశాఖ అన్ని వేళలా చట్టపరిధిలోనే పనిచేస్తుందని చెప్పారు. చంద్రబాబు నాయుడు జడ్+ ఎన్‌ఎస్‌జి భద్రత కలిగి ఉన్నారన్నారు. ఈ క్రమంలో ఆయన ప్రయాణించే కాన్వాయ్‌ని సక్రమ మార్గంలో తీసుకు వెళ్లే బాధ్యత పోలీస్ శాఖపై ఉందన్నారు. ఈక్రమంలోనే తిరుపతి పర్యటనలో కాన్వాయ్‌కి అడ్డువచ్చిన వారిని పోలీసులు పక్కకు తీసుకు వెళ్లారన్నారు. అయితే పోలీసులు వారిపై దాడి చేశారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. కాన్వాయ్ ముందుకు వెళుతున్న సమయంలో ద్విచక్రవాహనంలో వెళుతున్న వారు క్రమశిక్షణ లేకుండా పదే పదే కాన్వాయ్‌కి అడ్డు వచ్చారని, ఈ క్రమంలో వారిని సక్రమ పద్ధతిలో పెట్టే ప్రయత్నం చేశారన్నారు. కొంతమందిపై తప్పుడు కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తున్నారని వస్తున్న మాటలు పూర్తి సత్యదూరమన్నారు. రాష్ట్ర పోలీస్ వ్యవస్థ నిష్పక్షపాతంగా, పార్టీలకు అతీతంగా చట్టపరిధిలో పనిచేస్తోందని, ఇందుకు మరో అనుమానానికి తావు లేదన్నారు. జిల్లాలో కూడా నేరాల తీవ్రతను బట్టే రౌడీ షీట్‌లను ఓపెన్ చేస్తున్నామని, సదరు వ్యక్తి శాంతి భద్రతలకు విఘాతం కల్పించే విధంగా జరిగిన ఘటనల్లో పాల్గొన్న విషయాన్ని పరిశీలించి చర్యలు చేపడుతున్నామన్నారు. పోలీస్ శాఖ తప్పులు చేసి ఉంటే ప్రశ్నించడం తప్పుకాదన్నారు. ఇదిలా ఉండగా తిరుపతి పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకులు కూడా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.