ఆంధ్రప్రదేశ్‌

పాలకుల నయవంచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మడకశిర, సెప్టెంబర్ 8: రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై బిజెపి, టిడిపి ప్రభుత్వాలు మోసం చేశాయని పిసిసి అధ్యక్షులు రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలోని రాజీవ్‌గాంధీ సర్కిల్‌లో హోదా కోసం రఘువీరారెడ్డి ఆధ్వర్యంలో గురువారం రాస్తారోకో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభజన చట్టంలో ఎపికి ప్రత్యేక హోదా పదేళ్ళపాటు కల్పించాలని ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పక్కనబెట్టిందన్నారు. రెండున్నర సంవత్సరాల తరువాత తీరిగ్గా హోదా ఇవ్వడం కుదరదని చెప్పడంతో ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన అనుచరులు దోచుకోవడానికే సరిపోతుందని, రాష్ట్రం అభివృద్ధి చెందదన్నారు. హోదా ఇవ్వకపోతే రాష్ట్రంలో పరిశ్రమలు రావని, నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు సన్నగిల్లుతాయన్నారు. విభజన చట్టానికి విరుద్ధంగా కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటన చేస్తున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కేంద్ర ప్రభుత్వం చేపట్టాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వానికి ఎలా అప్పచెబుతారని రఘువీరా ప్రశ్నించారు. రాజకీయ లబ్ధికోసం అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేస్తే చాలని చంద్రబాబు భావిస్తున్నారన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా గురించి బాబు ఎక్కడా ప్రస్తావించడం లేదన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ0 రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తోందన్నారు.