ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్ర పోలీసు శాఖకు కొత్తగా ఐదుగురు ఐపీఎస్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 11: నేషనల్ పోలీసు అకాడమి శిక్షణ పూర్తిచేసుకున్న ఐదుగురు ఐపీఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వ పోలీసుశాఖకు కేటాయిస్తూ కేంద్ర హోం శాఖ సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. వీరిలో కర్ణాటకకు చెందిన పి జగదీష్, రాజస్థాన్‌కు చెందిన తుషార్ డుడి, తెలంగాణకు చెందిన కృష్ణకాంత్ పాటిల్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చందోలు మణికంఠ, కృష్ణకాంత్‌లు ఉన్నారు. ఏపికి కేటాయించిన ఐదుగురు ఐపీఎస్ అధికారులు సోమవారం రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డీజీపీ నూతన అధికారులకు ట్రైనింగ్ మెటీరియల్ కిట్‌లను అందజేశారు. రాష్ట్రంలో ఉన్న పోలీసు ప్రత్యేక విభాగాలైన సిఐడి, ఇంటలిజెన్స్, ఎస్‌బి, ఆక్టోపాస్, సెక్యూరిటీ వింగ్, విజిలెన్స్, ఏసిబి, గ్రేహౌండ్స్‌లో వీరికి శిక్షణ ఇవ్వాలని ఐజి సంజయ్‌కుమార్‌కు డీజీపీ సవాంగ్ ఆదేశాలు జారీచేశారు.
*చిత్రం...నూతన ఐపీఎస్ అధికారులతో డీజీపీ సవాంగ్, ఐజీ సంజయ్