ఆంధ్రప్రదేశ్‌

రాష్ట్రానికి ఏ విధంగా లబ్ధి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: అమరావతి స్టార్టప్ ఏరియా డెవలప్‌మెంట్ ప్రాజెక్టుతో రాష్ట్రానికి ఏ విధమైన లబ్ధి కలుగుతుందన్న ప్రశ్నకు సింగపూర్ కన్సార్టియం చెప్పిన సమాధానం సంతృప్తికరంగా లేదని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అందువల్లే పరస్పర అంగీకారంతో స్టార్టప్ ఏరియా డెవలప్‌మెంట్ ప్రాజెక్టును రద్దు చేసుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు సింగపూర్ కన్సార్టియం చెప్పలేకపోవడంతో ఈ ప్రాజెక్టుపై ముందుకు వెళ్లకూడదని నిర్ణయించామని మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ప్రాజెక్టు పనుల్లో కూడా ఆశించిన మేర ప్రగతి లేదని వివరించారు. ఈ ప్రాజెక్టు వల్ల రాష్ట్రానికి జరిగే లబ్ధి గురించి, జాప్యానికి కారణం గురించి అడిగామన్నారు. పనులు ఆశించిన స్థాయిలో జరగడం లేదని, ప్రాథమిక లాంచన ప్రక్రియ కూడా జరగలేదని తెలిపారు. గడచిన నాలుగు సంవత్సరాల్లో కన్సార్టియం స్టార్టప్ ప్రాజెక్టు పనుల్లో పురోగతి నమోదు చేయలేదని తెలిపారు. ఇదే సమయంలో విట్, అమృత, ఎస్‌ఆర్‌ఎం తదితర సంస్థలు కేటాయించిన భూమిని వినియోగించుకుని, కళాశాలలను నిర్వహించడాన్ని గుర్తు చేశారు. అభివృద్ధి, పురోగతి రెండు వేగంగా జరగాలన్నది ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
*చిత్రం... రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ