ఆంధ్రప్రదేశ్‌

వామపక్షాల ‘ఇసుక మార్చ్’ భగ్నం: నేతల అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 12: రాష్ట్రంలో నెలకొన్న ఇసుక కొరతను నివారించాలని, ఐదు నెలలుగా ఉపాధి లేక అలమటిస్తున్న భవన నిర్మాణ కార్మికులకు రూ. 20వేలు చొప్పున ఆర్థిక సాయం అందించాలని, ఆత్మహత్యలు చేసుకున్న కార్మికుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సీపీఐ, సీపీఎం ఇతర వామపక్షాలు మంగళవారం చేపట్టిన ఇసుక మార్చ్ కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. కనకదుర్గ వారధి వద్ద నుండి కృష్ణానదిలోని ఇసుక మేటల వరకు మార్చ్ నిర్వహించి ప్రభుత్వానికి నిరసన తెలిపాలని వామపక్షాలు పిలుపునిచ్చిన నేపథ్యంలో మంగళవారం ఉదయం నిర్ణీత ప్రదేశానికి చేరుకున్న నాయకులను, కార్యకర్తలను వచ్చిన వారిని వచ్చి నట్టే పోలీసులు అరెస్ట్ చేశారు. అయినప్పటికీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ, నగర కార్యదర్శి దోనేపూడి శంకర్, సీపీఎం వీ శ్రీనివాసరావు, యు ఉమామహేశ్వరరావు, సీహెచ్ బాబురావు తదితరులు కార్యకర్తలతో కలిసి వారధి వద్ద నుండి డొంక రోడ్డు మీదుగా నదిలోకి వెళ్లేందుకు ఉపక్రమించగా బలవంతంగా పోలీసులు అరెస్ట్ చేశారు.