ఆంధ్రప్రదేశ్‌

నియోజకవర్గాల్లో నీటి సమస్య పరిష్కారానికి చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 12: రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నీటి సమస్యను పరిష్కరించేందుకు వీలుగా 175 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది. అసెంబ్లీ నియోజకవర్గాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు సీఎం డెవలప్‌మెంట్ ఫండ్ పథకం ప్రారంభించింది. ఈ ఏడాది జూలై 11న అసెంబ్లీలో మంచి నీటి సమస్య పరిష్కరించేందుకు ప్రతి నియోజకవర్గానికి కోటి రూపాయలు మంజూరు చేస్తానని ప్రకటించారు. ఈ మేరకు ఒక్కో నియోజకవర్గానికి కోటి రూపాయల చొప్పున 175 కోట్ల రూపాయలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా శాఖల నిబంధనల మేరకు ఈ పనులను చేపట్టాలని, నామినేషన్‌కు అర్హమైన పనుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ను అమలు చేయాలని స్పష్టం చేసింది.
సతీష్ చంద్రకు ఎస్వీ వర్సిటీ వీసీ బాధ్యతలు
శ్రీ వేంకటేశ్వర వర్సిటీ ఇన్‌చార్జి వైస్ చాన్సలర్‌గా అదనపు బాధ్యతలను రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సతీష్ చంద్రకు అప్పగించింది. ఇప్పటి వరకూ ఇన్‌చార్జి వీసీగా వ్యవహరిస్తున్న జేఎస్వీ ప్రసాద్‌ను రిలీవ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయి.