ఆంధ్రప్రదేశ్‌

కొలిక్కిరాని తొక్కిసలాట విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, సెప్టెంబర్ 9: మరో 20 రోజుల్లో గడువు పూర్తికావస్తున్నా పుష్కర తొక్కిసలాట ఘటనకు సంబంధించి ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ విచారణ ఇంకా కొలిక్కిరాలేదు. ఈ నెలాఖరుతో కమిషన్ విచారణ గడువు పూర్తి కానుంది. రాజమహేంద్రవరం ఆర్ అండ్ బి అతిథి గృహంలో శుక్రవారం పుష్కర తొక్కిసలాట ఘటనపై నియమించిన కమిషన్ జస్టిస్ సివై సోమయాజులు విచారణ జరిపారు. గత విచారణలో కమిషన్ ఆదేశించినట్టుగా సంబంధిత సమాచారాన్ని అధికార యంత్రాంగం నుంచి సమీకరించి ప్రభుత్వ న్యాయవాది సిహెచ్ ప్రభాకర్‌రావు కమిషన్‌కు సమర్పించారు. 13 అంశాలకు సంబంధించి వేలాది పేజీలు కలిగిన 13 ఫైళ్ల రూపంలో డాక్యుమెంట్ల సమాచారాన్ని దొంతర్లుగా కమిషన్‌కు సమర్పించారు. అయితే పేజీల నంబర్లు వేసి నివేదికను సంక్షిప్తీకరించే రీతిలో మధ్యాహ్నంలోగా సమర్పించాల్సిందిగా ప్రభుత్వ న్యాయవాదిని కమిషన్ ఆదేశించింది. కమిషన్ తదుపరి విచారణ ఈ నెల 20వ తేదీకి వాయిదా వేస్తూ కమిషన్ జస్టిస్ సివై సోమయాజులు ఆదేశాలుజారీచేశారు. విచారణలో కమిషన్ సహాయక న్యాయవాది మద్దూరి శివసుబ్బారావు, బాధితుల తరపు న్యాయవాదులు ముప్పాళ్ళ సుబ్బారావు, శ్రీనివాసరావు, డిఎస్పీ కులశేఖర్, సిపిఐ నాయకుడు నల్లా రామారావు తదితరులు పాల్గొన్నారు. కాగా విలువైన కమిషన్ కాలాన్ని హరించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వ యంత్రాంగం అనవసర సమాచారాన్ని దొంతర్లుగా సమర్పిస్తోందని, ఇది కమిషన్ కాలాన్ని వృథాచేయడమే అవుతుందని బాధితుల తరపు న్యాయవాది ముప్పాళ్ళ సుబ్బారావు ఆరోపించారు. పుష్కర తొక్కిసలాట జరిగినపుడు డ్రోన్ కెమెరాలు, సిసి కెమెరాల ద్వారా చిత్రీకరించిన విజువల్ పుటేజి రికార్డు కాలేదని, అందుకనే సమర్పించలేదని ప్రభుత్వ యంత్రాంగం కమిషన్‌కు నివేదిక ఇవ్వడం దారుణమన్నారు. ఏదైనా విచారణకు దోహదపడుతుందని, లేదంటే రద్దీని నియంత్రించడానికనే ఉద్దేశ్యంతోనే సిసి కెమెరాలను పెడతారని, ఇప్పుడు రికార్డు కాలేదని, పుటేజి లేదని చెప్పడం తప్పించుకోవడమేనన్నారు. నేషనల్ జియోగ్రఫీ ఛానల్ రూపొందించిన మూల విజువల్స్‌లో అవసరమైన చోట్ల ఎడిటింగ్ చేసి కమిషన్ ముందు ప్రదర్శించారంటే కచ్చితంగా అధికారులు, ప్రభుత్వం వక్రభాష్యం చెబుతోందని అర్ధమవుతోందని, పరోక్షంగా నేరాన్ని అంగీకరించినట్టేనని ముప్పాళ్ళ ఆరోపించారు.