ఆంధ్రప్రదేశ్‌

2నుంచి అసెంబ్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 16: రాష్ట్ర శాసనసభ సమావేశాలు వచ్చేనెల 2 నుంచి ప్రారంభం కానున్నాయి. సుమారు 15 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సమావేశాల్లో భాగంగా వివిధ అంశాలకు సంబంధించిన చట్ట సవరణ బిల్లులను సభలో ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. ఇసుక అక్రమ రవాణా నియంత్రణ చట్టంతో పాటు, ప్రభుత్వ భూముల విక్రయం, అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణకు మునిసిపల్ లా చట్ట సవరణ, న్యాయవాదుల సంక్షేమ నిధి చట్ట సవరణ, మరి కొన్ని బిల్లులను సమావేశాల్లో చర్చించి ఆమోదించాలని యోచిస్తోంది. ఇదిలా ఉండగా ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నుంచి అధికార పార్టీలోకి ఎమ్మెల్యేలు వలస వస్తున్నందున దీనిపై ఆచితూచి అడుగేయాలని భావిస్తోంది. ముందుగా అనర్హులుగా ప్రకటించాలా.. లేక తటస్థులుగా కొనసాగిస్తూ ప్రతిపక్షాన్ని బలహీన పరచాలా అనే విషయాలపై పార్టీ ఎమ్మెల్యేలు, సహచర మంత్రులతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చర్చిస్తున్నట్లు వినికిడి. శాసనసభలో ప్రతిపక్ష హోదా దక్కాలంటే 18 మంది ఎమ్మెల్యేలు ఉండాలి. ప్రస్తుతం టీడీపీకి ఉన్న 23 మందిలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆ పార్టీకి రాజీనామా చేశారు. శాసనసభ సమావేశాలు జరిగేలోగా మరో ఐదుగురు ఎమ్మెల్యేలు వలస వస్తే టీడీపీ ప్రతిపక్ష హోదా కోల్పోతుందనే భావనతో ఉన్నట్లు తెలిసింది. దీనిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అయితే శాసనసభ్యత్వానికి రాజీనామా చేయకుండా పార్టీ మారితే అనర్హత వేటు తప్పదనే సంకేతాలు అందుతున్నాయి. గన్నవరం ఎమ్మెల్యే వంశీ వైసీపీలో చేరాలంటే శాసనసభ్యత్వానికి విధిగా రాజీనామా చేయాలని, ఈ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మాటకు కట్టుబడి ఉంటానని తేల్చి చెప్పారు. దీంతో వలసలకు బ్రేక్ పడవచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే శాసనసభ సమావేశాలు రసవత్తరంగా సాగనున్నాయి.