ఆంధ్రప్రదేశ్‌

ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో మళ్లీ నెం.1

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మరోసారి రాష్ట్రం నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకుంది. ఈనెల 14 నుంచి 27 వరకు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 39వ ‘ఇండియా ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్’ (ఐఐటీఎఫ్-2019)లో భాగంగా రాష్ట్రానికి మరోవిడత ఈ అరుదైన గుర్తింపు లభించింది. ఏటా జరిగే ఈ ట్రేడ్ ఫెయిర్‌కు వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రతినిధులు హాజరవుతారు. ఈ ఏడాది ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ అంశాన్ని ట్రేడ్ ఫెయిర్ ఎంచుకుంది. సమకాలీన సాంకేతికత ప్రామాణికంగా ఏపీ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలను ట్రేడ్ ఫెయిర్‌లో ఆవిష్కరించింది. వైఎస్సార్ నవోదయం, చిన్న, సూక్ష్మ తరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ)ల ఏర్పాటులో తీసుకువస్తున్న మార్పులు, కీలక రంగాలైన టెక్స్‌టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్స్,
ఎలక్ట్రానిక్ వాహనాలు, రసాయనాలు, పెట్రో కెమికల్ పరిశ్రమలు, ఫార్మాస్యూటికల్స్, ఎలక్ట్రానిక్స్, విశాఖ- చెన్నై, చెన్నై- బెంగుళూరు ఇండస్ట్రిల్ కారిడార్లు, విమాన, నౌకా శ్రయాల అభివృద్ధికి ప్రభుత్వ విధానాలే కొలమానంగా ట్రేడ్ ఫెయిర్‌లో మరోసారి గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా సెర్ప్, మెప్మా, ఎలీప్‌ల ఆధ్వర్యంలో టెక్స్‌టైల్ రంగానికి సంబంధించి చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి, కృష్ణాజిల్లా పెడనలో కలంకారీ అద్దకాలు, అనంతపురం జిల్లా నిమ్మలకుంట తోలు పరిశ్రమ, హస్త కళా వస్తు ప్రదర్శనలు వివిధ రాష్ట్రాల ప్రతినిధులను ఆకట్టుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమల ప్రోత్సాహక అంతర్జాతీయ సంబంధాల సలహాదారు పీటర్ టీ హుస్సేన్, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రజత్ భార్గవ, ఢిల్లీలో ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ భావనా సక్సేనా, తదితర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ట్రేడ్ ఫెయిర్‌లో రాష్ట్రానికి సంబంధించిన వివిధ ప్రదర్శనలతో పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వ కార్యక్రమాలను వివిధ ప్రాంతాల నుంచి హాజరైన ప్రతినిధులు ప్రశంసించారు. రాష్ట్ర పరిశ్రమలశాఖ డైరెక్టర్ జేవీఎన్ సుబ్రహ్మణ్యం పర్యవేక్షణలో ట్రేడ్ ఫెయిర్‌లో ఏపీ ఎగ్జిబిషన్ ఏర్పాటైంది.