ఆంధ్రప్రదేశ్‌

సీఎంను విమర్శిస్తే చూస్తూ ఊరుకోం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 16: రాజకీయాల్లో చంద్రబాబు శకం ముగిసిందని, పెట్టా బేడా సర్దుకుని సింగపూర్‌కు పయనమయ్యే రోజు త్వరలోనే వస్తుందని రాష్ట్ర పౌరసరఫరాల మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) అన్నారు. భవిష్యత్ నాయకుడుగా చెప్పుకుంటున్న లోకేష్ టీడీపీని రక్షించలేరని ఆ పార్టీ ఎమ్మెల్యేలే అనుకుంటున్నారన్నారు. దీంతో ఏమీ పాలుపోక కులం, మతం, ఇంగ్లీషు, ఇసుక అంశాలపై బురద రాజకీయాలకు పాల్పడుతున్నారని విరుచుకుపడ్డారు. శనివారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో 23 సీట్లతో ప్రజలు గుణపాఠం చెప్పినా చంద్రబాబు, లోకేష్‌లకు బుద్ధి రాలేదన్నారు. ప్రభుత్వం పారదర్శకమైన, అవినీతి రహిత పాలన అందిస్తుంటే ఓర్చుకోలేక రాష్ట్రంలో ఇసుక కొరత ఉన్నట్లు రాజకీయాలు చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, సీఎంను విమర్శింస్తే తాము సహించేది లేదని స్పష్టంచేశారు. గతంలో తమ పార్టీ నుంచి గెలిచిన 23 ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేసి వారిలో ఐదుగురికి మంత్రి పదవులు ఇచ్చి, రాజ్యాంగాన్ని అపహాస్యం చేసిన చంద్రబాబు ఇప్పుడు గన్నవరం ఎమ్మెల్యే వంశీ విషయంలో నీతులు చెప్తున్నారన్నారు. వంశీ కేవలం మద్దతు మాత్రమే తెలిపారని, ఇంకా పార్టీలో చేరలేదన్న విషయం కూడా చంద్రబాబు మట్టిబుర్రకు తట్టడం లేదన్నారు. గతంలో ఇదే చంద్రబాబుకు రెండుసార్లు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా అవకాశం కల్పించి మంత్రి పదవి కూడా ఇస్తే చంద్రబాబు కాంగ్రెస్ పార్టీని మోసం చేసిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. రాష్టవ్య్రాప్తంగా తమ పార్టీలోకి ఎవరు వచ్చినా చేర్చుకుంటామని, కానీ తమ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయాల్సి ఉంటుందని స్పష్టంచేశారు. మాజీమంత్రి దేవినేని ఉమా వంటి వారు సన్నబియ్యంపై విమర్శలు చేస్తున్నారంటూ సన్నబియ్యం త్వరలోనే అన్ని జిల్లాలకు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ఐదు నెలల్లో సన్నబియ్యం ప్రతిఇంటికీ ఇస్తామని తమ ప్రభుత్వం చెప్పిందా అంటూ ప్రశ్నించారు. సోదరుడు మృతిచెందాక రాజకీయాల్లోకి వచ్చి తన రాజకీయ జీవితానికి వదిన అడ్డు వస్తుందేమోనని ఆమెను కూడా అంతమొందించిన నీచ చరిత్ర ఉన్న వారికి తమ ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. రెండు చోట్లా పోటీచేసి ఓడిపోయిన పవన్‌కళ్యాణ్ ముఖ్యమంత్రి మతం, కులం అడిగితే సమాధానం చెప్పాల్సిన అవసరం తమ పార్టీకి లేదన్నారు. ప్రతి పేద, మధ్య తరగతి పిల్లలు ఇంగ్లీషు చదివితే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరతారనే మంచి ఆలోచనతో సీఎం నిర్ణయం తీసుకుంటే దాన్నీ రాజకీయం చేయడం సిగ్గుచేటని మంత్రి మండిపడ్డారు.
*చిత్రం... విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కొడాలి నాని