ఆంధ్రప్రదేశ్‌

ఇసుక అక్రమ రవాణా, నిల్వలపై కఠిన చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 16: ఇసుక అక్రమ రవాణా, నిల్వలు చేసే వ్యాపారులకు జరిమానా, జైలు శిక్ష విధిస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన ప్రభుత్వం ఆ మేరకు శనివారం ఉత్తర్వులు జారీచేసింది. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఇసుక అక్రమంగా నిల్వ చేసినా, అధిక ధరలు వసూలు చేసినా, ఇతర రాష్ట్రాలకు అక్రమ రవాణా చేసినా రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ. 2 లక్షల జరిమానా విధించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో గతంలో ఉన్న నిబంధనలను సవరిస్తూ మైన్స్, మినరల్స్ చట్టంలో సవరణలు తీసుకువస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులలో పేర్కొంది. అవసరాలకు మించి ఇసుక నిల్వ చేసినా కఠిన శిక్ష విధించనున్నట్లు స్పష్టం చేసింది.
గోవా డీజీపీ మృతి బాధాకరం
గుంటూరు, నవంబర్ 16: తనకు మంచి మిత్రుడు, తన సహచరుడు గోవా డీజీపీ ప్రణబ్ నందా మృతి తనను కలచివేసిందని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆవేదన వ్యక్తంచేశారు. గోవా డీజీపీగా విధులు నిర్వహిస్తున్న ప్రణబ్ నందా శనివారం హఠాన్మరణం చెందారు. దీనిపై డీజీపీ సవాంగ్ మాట్లాడుతూ తాను ప్రణబ్ నందా ఢిల్లీ యూనివర్శిటీలో కలిసి చదువుకున్నామని, ఐపీఎస్‌గా ఎన్నికైన తర్వాత పోలీసుశాఖకు ఆయన అందించిన సేవలు అపురూపమని కొనియాడారు. ఆయన గుండెపోటుతో మరణించారన్న వార్త తనను తీవ్రంగా బాధించిందని, ఆయన మృతి వ్యక్తిగతంగా తనకు తీరనిలోటని, వారి కుటుంబానికి ప్రగాడ సానుభూతి ప్రకటించారు.
చెరకు రైతాంగాన్ని ఆదుకోవాలి

విజయవాడ, నవంబర్ 16: రాష్ట్ర ప్రభుత్వం చెరకు రైతులను ఆదుకునేందుకు సలహాధర ప్రకటించే విధానాన్ని పునరుద్ధరించాలని లేదా టన్ను చెరకు రూ. వెయ్యి రూపాయల వంతున రైతులకు ప్రోత్సాహక సబ్సిడీ అందించి ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్, చెరకు రైతుల సంఘ నాయకులు వెలగపూడి ఆజాద్, బుడితి అప్పలనాయుడు ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో గత సీజన్‌లో 18 చక్కెర ఫ్యాక్టరీల ద్వారా 54 లక్షల టన్నుల చెరకు క్రషింగ్ జరిగిందని, ప్రస్తుత సీజన్‌లో 5 ఫ్యాక్టరీలు మూతబడి 13 ఫ్యాక్టరీలలో 36 లక్షల టన్నుల క్రషింగ్ జరిగే అవకాశాలున్నాయన్నారు.

ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనకై పోరాడండి

విజయవాడ, నవంబర్ 16: సోమవారం నుండి ప్రారంభం కానున్న శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో మన రాష్ట్ర హక్కుల సాధన కోసం పట్టుబట్టి పోరాడాలని రాష్ట్ర ఎంపీలకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన చట్టంలోని హామీలు అమలు జరపకుండా కేంద్రం విద్రోహానికి పాల్పడుతున్నదని, ఎన్నికలకు ముందు ఈ అంశాల సాధనకై పోరాటాలు జరిగాయన్నారు.
కేజీహెచ్‌లో అరుదైన శస్త్ర చికిత్స

విశాఖపట్నం, నవంబర్ 16: ఆంధ్రా మెడికల్ కళాశాల, కింగ్ జార్జి ఆసుపత్రి సంయుక్తంగా ఒక అరుదైన శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించాయి. అప్పుడే పుట్టిన పసికందు బాలిక నోరు, కను రెప్పలు కలిపోయి ఉండటాన్ని చంటి పిల్లల వైద్యులు గుర్తించారు. కొన్ని వైకల్యాలతో పిల్లలు జన్మించడం సాధారణంగా జరుగుతుంది. అయితే పరవాడలోని ప్రభుత్వాసుపత్రిలో జన్మించిన ఈ బాలిక లోపాలను గుర్తించిన వైద్యులు కేజీహెచ్‌కు తరలించారు. బాలిక లోపాలను గుర్తించిన ప్లాస్టిక్ సర్జరీ విభాగం అరుదైన శస్త్ర చికిత్సకు నిర్ణయించింది. నవంబర్ 13న బాలికకు శస్త్ర చికిత్స నిర్వహించారు. ప్రొఫెసర్ డాక్టర్ పీవీ సుధాకర్, డాక్టర్ యోగిత సహా పలువురు వైద్యులు స్కిన్ హైపర్పిగ్మెంటేషన్, నాలుక, పెదవులు చీలి ఉన్న వాటిని ప్లాస్టిక్ సర్జరీ ద్వారా సరిచేశారు. శస్త్ర చికిత్సలు విజయవంతంగా పూర్తయ్యాయని, అయితే మూడు నెలల తరువాత ఎదురయ్యే కొన్ని ఇబ్బందులకు మరోసారి శస్తచ్రికిత్సలు అవసరం అవుతాయని తెలిపారు.
మెడలు వంచుతారా?: తులసిరెడ్డి

విజయవాడ, నవంబర్ 16: రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలు అమలు కోసం కేంద్రం మెడలు వంచుతారా.. మీరే మెడలు దించుకుంటారా అని వైసీపీ ఎంపీలను పీసీసీ ఉపాధ్యక్షుడు ఎన్ తులసిరెడ్డి ప్రశ్నించారు. విభజన చట్టం ప్రకారం కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాల్సింది కొండంత కాగా ఇచ్చింది గోరంత అన్నారు. రాష్ట్రానికి సంజీవిని లాంటి ప్రత్యేక హోదా ముగిసిన ఆధ్యాయమంటున్నారన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్రులకు బుందేల్ ఖండ్ తరహాలో ప్రత్యేక అభివృద్ది ప్యాకేజీ కింద పిల్లికి బిచ్చం వేసినట్లు రూ. 24,350 కోట్లకు గానూ కేంద్రం కేవలం రూ. 1050 కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు.