ఆంధ్రప్రదేశ్‌

పర్యాటక బోట్ల లైసెన్సులకు మళ్లీ దరఖాస్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 19: రాష్ట్రంలోని అన్ని పర్యాటక బోట్లు లైసెన్సుల కోసం మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిందేనని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. సరంగులకు శిక్షణ ఇచ్చి వచ్చే నెల 10న పరీక్ష నిర్వహిస్తామన్నారు. వెలగపూడి సచివాలయంలో టూరిజం బోట్ల నిర్వహణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై అధికారులతో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో 300 బోట్లు, పర్యాటక శాఖ ఆధీనంలో 54 బోట్లు ఉన్నాయని తెలిపారు. బోట్ ఫిట్‌నెస్, నదులు, జలవనరుల్లో రూట్‌సర్వే, సరంగుకు డ్రైవింగ్ శిక్షణ వంటి అంశాలను తప్పనిసరి చేశామన్నారు. ఇప్పటికే సగానికి పైగా బోట్ల తనిఖీని పూర్తి చేశామన్నారు. పోర్టు అథారిటీ నుంచి అనుమతులు వచ్చాకే పర్యాటకానికి అనుమతిస్తామన్నారు. సరంగులకు 18 రోజుల పాటు శిక్షణ ఇచ్చి, డిసెంబర్ 10న కాకినాడలో పరీక్ష నిర్వహిస్తామన్నారు. పరీక్షలో ఉత్తీర్ణులైన వారికే లైసెన్సులు జారీ చేస్తామన్నారు. ఈ బోట్ల నిర్వహణకు సంబంధించి రాష్ట్రంలో 9 చోట్ల కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ నెల 21న ముమ్మిడివరంలో ఒక కంట్రోల్ రూమ్ నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారన్నారు. ఎమ్మార్వో స్థాయి అధికారి, పర్యాటక, పోలీసు, విపత్తు నిర్వహణ, జలవనరుల శాఖ అధికారులు ఈ కంట్రోల్ రూమ్‌ల్లో విధులు నిర్వహిస్తారన్నారు. టూరిజం బోట్లకు రూట్ పర్మిషన్‌ను జలవనరుల శాఖ ఇస్తుందన్నారు.
మధుమేహం కారణంగానే చెప్పులు
మధుమేహం కారణంగానే మాలలో ఉండగా చెప్పులు వేసుకుంటున్నానన్నారు. ఇది తప్పు కాదన్నారు. టీడీపీ హయాంలో మాల వేసుకున్నప్పుడు కూడా చెప్పులు ఉన్నాయని, అప్పుడు కనిపించలేదా అని ప్రశ్నించారు. హిందువుగానే పుట్టానని, హిందువుగానే చనిపోతానని స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే చింతమనేని జైల్లో ఉండటం వల్ల ఆయనకు సానుభూతి వచ్చి ఉంటుందని భావించి, ప్రతిపక్ష నేత చంద్రబాబు వెళ్లి పరామర్శించారన్నారు. చింతమనేని ఆ విధంగా అవడానికి చంద్రబాబే కారణమని ఆరోపించారు.