ఆంధ్రప్రదేశ్‌

వ్యవసాయ విజ్ఞానం గ్రామాలకు చేరాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం(రూరల్), నవంబర్ 19: వ్యవసాయ విజ్ఞానం గ్రామాలకు చేరాలని సభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లాలోని రాగోలు వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో మంగళవారం కిసాన్ మేళా కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించిన సభాపతి సీతారాం, రోడ్డు భవనాల శాఖా మంత్రి ధర్మాన క్రిష్ణదాస్, కలెక్టర్ జనార్దన్ నివాస్ మాట్లాడారు. ముందుగా స్పీకర్ మాట్లాడుతూ పరిశోధనా ఫలితాలు, సమాచారం, రైతులకు అందాలన్నారు. ఇప్పటికీ జిల్లా రైతులు సంప్రదాయా వ్యవసాయానే్న చేపడుతున్నారన్నారు. జిల్లాలో నాలుగు జీవనదులు ఉన్నాయని, వంశధార ప్రాజెక్టు పూర్తి చేసేందుకు నిధులు కేటాయించినట్లు స్పష్టం చేసారు. వైఎస్సార్ పొలం బడికి సరైన రూపం ఇవ్వాలన్నారు. వ్యవసాయ విద్యార్థులు తమ పరిజ్ఞానాన్ని గ్రామాల్లోని రైతుల అనుభవానికి జోడించాలన్నారు. క్షేత్ర స్థాయిలోకి వెళ్లి అక్కడి రైతులకు అవగాహన కల్పించాలన్నారు. పొలం బడి షెడ్యూల్ ఇవ్వాలని సూచించారు. రైతులకు సరైన అవగాహన కల్పిస్తే ప్రభుత్వ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోగలరన్నారు. రైతులు నష్టపోకూడదని, ప్రభుత్వమే నాణ్యమైన స్టోర్లను ఏర్పాటు చేస్తుందన్నారు. దళారీ వ్యవస్థ పోవాలని, పండించిన పంటలను నిల్వ చేసుకునే వ్యవస్థ ఉండాలన్నారు. శాస్తవ్రేత్తలతో ముఖాముఖి ఏర్పాటు చేసి ఆధునిక యాంత్రీకరణ పద్ధతులు పరిచయం చేయాలన్నారు. అత్యాధునిక పరిజ్ఞానాన్ని రైతులు స్వాగతించాలన్నారు. మంత్రి ధర్మాన క్రిష్ణదాస్ మాట్లాడుతూ శ్రీకాకుళం వ్యవసాయ జిల్లా అని, అవగాహన పెంచుకొని వ్యవసాయం చేసి ఆర్థికంగా ముందంజ వేయాలని, రైతుకు అండగా ముఖ్యమంత్రి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. వ్యవసాయంలో మెళుకువలు పాటించి దిగుబడులు సాధించాలన్నారు. అదును..పదును చూసి వ్యవసాయం చేయాలన్నారు. రానున్న అయిదేళ్లూ వ్యవసాయానికి స్వర్ణయుగమని తెలియజేసారు. రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రూ.4 వేల కోట్లతో ప్రకృతి వైపరీత్యాల సహాయనిధి ఏర్పాటు చేశామన్నారు. కలెక్టర్ జనార్దన్ నివాస్ మాట్లాడుతూ 1010 రకం నిషేధించినప్పుడు రైతులు సహకరించారన్నారు. జిల్లాలో నాణ్యమైన బియ్యం ఉత్పత్తి చేసేందుకు చర్యలు తీసుకున్నామని, 1075 రకం విత్తనాలు సరఫరా చేసామన్నారు. ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం డైరెక్టర్ డా.పి.రాంబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో 13 కిసాన్ మేళాలు నిర్వహిస్తున్నామన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం రిసెర్చ్ డైరెక్టర్ ఎ.ఎస్.రావు, అనకాపల్లి అసోసియేట్ డైరెక్టర్ డా.జమున, ఎ.ఆర్.సి. ప్రధాన శాస్తవ్రేత్త కె.వి.రమణమూర్తి, వ్యవసాయ మిషన్ సభ్యుడు గొండు రఘురాం, నైర కళాశాల అసోసియేట్ డీన్ ఎ.వి.రమణ, వ్యవసాయశాఖ ఎ.డి. కె.శ్రీ్ధర్, గొండు క్రిష్ణమూర్తి, చిరంజీవి నాగ్, శాస్తవ్రేత్తలు చిట్టిబాబు, చిన్నంనాయుడు, సరేష్, రైతులు, అధికారులు ఉన్నారు.
*చిత్రం...సమావేశంలో మాట్లాడుతున్న స్పీకర్ తమ్మినేని సీతారాం