ఆంధ్రప్రదేశ్‌

ఆపరేషన్ ‘క్రాస్’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, నవంబర్ 19: రాష్ట్రంలో రాజకీయ చదరంగం ప్రారంభమైందని భారతీయ జనతా పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ప్రధానంగా అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుని ప్రత్యేక కార్యక్రమం చేపట్టినట్లు పార్టీ పెద్దల ద్వారా తెలుస్తోందని కొందరు బీజేపీ నేతలు వెల్లడిస్తున్నారు. దీనికి ‘ఆపరేషన్ క్రాస్’ అని పేరు పెట్టినట్లు తమకు సమాచారం ఉందని వారంటున్నారు. అయితే, జాతీయ స్థాయి నేతలే ఈ కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షిస్తున్నారని, పూర్తి వివరాలు తమకు తెలియడం లేదని వారు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రంలో గత మే నెలలో జరిగిన ఎన్నికల్లో టీడీపీపై ఉన్న ఆగ్రహంతో పరోక్షంగా వైసీపీకి బీజేపీ సహకరించిందని వారు స్పష్టం చేస్తున్నారు. అయితే ఎన్నికలు ముగిసిన తరువాత వైసీపీ అధినేతలో మార్పు వచ్చి కేవలం తమ బలంతోనే ఎన్నికల్లో భారీ విజయం సాధించామన్న అభిప్రాయం కనిపించిందని వెల్లడిస్తున్నారు. దాంతో ఆయన రాష్ట్రంలో తనదైన శైలిలో పాలన చేస్తూ ఎవరినీ లెక్క చేయని విధంగా ముందుకుపోతున్నారని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. అయితే రాష్ట్రంలో ఎలా పాలించుకున్నా తమ పార్టీ పెద్దలు పట్టించుకునే వారు కాదని, అయితే మతమార్పిడులను ప్రోత్సహించే విధంగా తీసుకుంటున్న చర్యలతో బీజేపీ దృష్టి సారించాల్సి వచ్చిందని తమకు సమాచారం ఉందని స్పష్టం చేస్తున్నారు. దీంతో వైసీపీని లక్ష్యంగా చేసుకుని రాజకీయ చదరంగం ప్రారంభించారని పేర్కొంటున్నారు. తమ పార్టీ పెద్దల ప్రయత్నాలతో కొందరు బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఇందుకు వారిలో కూడా మతమార్పిడులను ప్రోత్సహించడం సరైంది కాదన్న అభిప్రాయమే కారణమని వెల్లడిస్తున్నారు. బీజేపీ చర్యలను గమనించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సైతం దీటుగా ఎదుర్కొనేందుకు పావులు కదుపుతున్నారని గుర్తు చేస్తున్నారు. ప్రధానంగా లోక్‌సభ, రాజ్యసభ సభ్యులకు నిబంధనలు విధించి కేంద్ర మంత్రులను ఒంటరిగా, పార్టీకి తెలియకుండా కలవకూడదని నిర్దేశించిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వాన్ని పడగొట్టాలన్న లక్ష్యం ఏదీ లేదని, అయితే మత మార్పిడులను ప్రోత్సహించే చర్యలను ఎదుర్కొనడానికి కొన్ని ఎత్తులు వేయక తప్పడం లేదని బీజేపీ నేతలు వెల్లడిస్తున్నారు. వైసీపీ తీరులో మార్పు రాకపోతే కొత్త సంవత్సరంలో రాజకీయ సంచలనాలు తెరపైకి వస్తాయని కమలనాథులు స్పష్టం చేస్తున్నారు.