ఆంధ్రప్రదేశ్‌

ఆరు వరకు ఆంగ్ల మాధ్యమం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి ఆరు తరగతుల వరకు బోధనను ఇంగ్లీషు మాధ్యమంలోకి మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. తరువాత ప్రతి సంవత్సరం నుంచి ఒక్కో తరగతిని ఇంగ్లీషు మీడియంలోకి మార్చేందుకు నిర్ణయించింది. వివిధ యాజమాన్యాల కింద ఉన్న ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీషు మీడియంలోకి మారుస్తూ ఆదేశాలు జారీ చేసింది. తెలుగు/ఉర్దూను తప్పనిసరి సబ్జెక్ట్‌గా అమలు చేయాలని ఆదేశించింది. ఉపాధ్యాయ, విద్యార్థి నిష్పత్తికి అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించేందుకు చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్య కమిషనర్‌ను ఆదేశించింది. ఉపాధ్యాయుల హ్యాండ్ బుక్‌ల అభివృద్ధి, ఇంగ్లీషులో బోధనపై ఉపాధ్యాయులకు శిక్షణ, తదితర అంశాల్లో ఎస్‌సీఈఆర్టీ తగిన చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఇంగ్లీషులో ఉపాధ్యాయుల బోధనా నైపుణ్యాలను మదింపు చేసి, ఆ మేరకు శిక్షణా కార్యక్రమాలను రూపొందించాలని ఆదేశించింది. వచ్చే
ఏడాది వేసవిలో ఉపాధ్యాయులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇంగ్లీషులో బోధనా నైపుణ్యం పెంపొందించేలా ఎక్కువ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇంగ్లీషు టీచింగ్ సెంటర్లు, జిల్లా ఇంగ్లీషు సెంటర్ల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే ఇంగ్లీషు మీడియం పాఠ్యపుస్తకాలు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది. బోధనా మాధ్యమం మారుస్తున్న నేపథ్యంలో కావాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య అంచనా వేయాలని, తదుపరి ఉపాధ్యాయుల నియామకాల్లో ఇంగ్లీషు నైపుణ్యం ఉన్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలని అదేశించింది.