ఆంధ్రప్రదేశ్‌

ఇండో-అమెరికా త్రివిధ దళాల సంయుక్త విన్యాసాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, నవంబర్ 20: తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సాగర తీరంలో ఇండో- అమెరికా త్రివిధ దళాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సైనిక విన్యాసాల్లో భాగంగా బుధవారం విపత్కర పరిస్థితుల్లో సైన్యం అందిచే వైద్యం, సహాయకచర్యలపై డెమో నిర్వహించారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ విన్యాసాలకు మీడియాను దూరంగావుంచారు. బుధవారం మీడియా ప్రతినిధులను ఆహ్వానించి, ఆకస్మికంగా శత్రు దళాలు జరిపే దాడుల్లో గాయపడి విలవిల్లాడుతున్న ప్రజలను ఏ విధంగా కాపాడతారో ప్రదర్శించారు. గాయపడినపుడు అందించే ప్రాథమిక చికిత్స, హెలికాఫ్టర్ ద్వారా తరలింపు, మరోచోట గాయపడిన వారి రక్షణకై సిద్ధంచేసిన మందులు, ఇంజక్షన్లు, సెలైన్లు ఎక్కించడం వంటివి ప్రదర్శించారు.
ఈ సందర్భంగా నేవల్ ఎన్‌క్లేవ్ వద్ద అడ్మిరల్ సూరజ్ బేర్ మాట్లాడుతూ దేశంతో పాటు వివిధ దేశాల్లో సంభవించే ప్రకృతి వైపరీత్యాల్లో ప్రమాదాలకు గురయ్యే వారిని ఎలా రక్షిస్తారనే విషయమై ఇండో- అమెరికా త్రివిధ దళాల సంయుక్త విన్యాసాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వివిధ సందర్భాల్లో గాయపడిన వారిని మూడు తరగతులుగా విభజిస్తామన్నారు. వారికి తగిన చికిత్స అందించడానికి ప్రత్యేక వైద్య బృందాలు సిద్ధంగా ఉంటాయన్నారు. అవసరమైన వారిని ప్రత్యేక హెలికాఫ్టర్ ద్వారా సమీపంలోని నేవీ ఆసుపత్రికి తరలిస్తామని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో సముద్రపు నీటిని తాగునీరుగా మార్చుకోవడం ఈ విన్యాసాలలో ఓ భాగమన్నారు. భారత దేశానికి చెందిన వారు, 1200 మంది, అమెరికాకు చెందిన 500 మంది ఈ విన్యాసాల్లో పాల్గొన్నట్లు సూరజ్ బేర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో అమెరికాకు చెందిన లెఫ్ట్‌నెంట్ కల్నల్ డాన డీమర్, కాకినాడ డిఎస్పీ కరణం కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ విన్యాసాలు సందర్భంగా కాకినాడ బీచ్ రోడ్డులో రాకపోకలను దారి మళ్ళించారు.
*చిత్రం... గాయపడిన వ్యక్తికి ప్రాథమిక చికిత్స అందించడాన్ని ప్రదర్శిస్తున్న సైనికులు