ఆంధ్రప్రదేశ్‌

అనంతలో ‘వీరా’ యూనిట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: అనంతపురంలో ఎలక్ట్రికల్ బస్సులను తయారు చేసే యూనిట్ ఏర్పాటు చేసేందుకు వీరా వాహన ఉద్యోగ్ సంస్థ ముందుకు వచ్చింది. దాదాపు 1000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ యూనిట్ ఏర్పాటు చేసేందుకు వీలుగా ఒప్పందం చేసుకున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 120 ఎకరాల్లో ఏర్పాటు కానున్న ఈ యూనిట్‌లో ఏడాదికి 3 వేల ఎలక్ట్రికల్ బస్సులు తయారు అవుతాయని తెలిపారు. రాష్ట్ర ఆదాయం కోల్పోని విధంగా చాలా తక్కువ మొత్తాన్ని ప్రోత్సాహకాలుగా ఇస్తున్నామన్నారు. విద్యుత్ రాయితీలు, నీటి సరఫరా వంటి వౌలిక అంశాలకు సంబంధించి కూడా పరిమితికి లోబడి ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో చేసుకున్న కనె్వన్షన్ సెంటర్, ఫైవ్ స్టార్ హోటళ్ల ఏర్పాటు, లులూ గ్రూపుపెట్టుబడులకు సంబంధించి అసత్య ప్రచారం జరుగుతోందన్నారు. లులూ సంస్థకు కేటాయించిన భూమి కోర్టు వివాదాల్లో ఉందని, న్యాయపరమైన చిక్కుల్లో ఉన్న భూమిని కేటాయించడంపై ఏపీఐఐసీ ఏండీ లేఖ రాయడాన్ని మంత్రి గుర్తు చేశారు. తమ ప్రభుత్వం పారదర్శకతకే పెద్దపీట వేస్తోందన్నారు. తప్పును తప్పు అని చెప్పకుండా తప్పుదారిలో వెళ్లడం సరికాదన్నారు. పరిశ్రమలు వెళ్లిపోతున్నాయని జరుగుతున్న ప్రచారం నిజం కాదన్నారు. గత ప్రభుత్వం ఇష్టారీతిన చేసుకున్న లోపాయికారి ఒప్పందాలను ప్రజలను ముందు ఉంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. లులూ సంస్థతో ఒప్పందం రద్దు చేసుకోవడానికి ప్రధానంగా బిడ్డింగ్‌లో పారదర్శకత లేకపోవడం, విలువైన భూమిని తక్కువ ధరకు కేటాయించడం కారణమన్నారు. దాదాపు ఎకరా 42 కోట్ల రూపాయలు విలువైన 13.83 ఎకరాల స్థలాన్ని కేవలం చదరపు అడుగును 5 రూపాయలకు అద్దెకు ఇవ్వడం సరికాదన్నారు. దీని వల్ల 500 కోట్ల రూపాయల ప్రజా ధనం వృథా అవుతుందన్నారు. గత ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నా, సంవత్సరం పాటు అదే ప్రభుత్వం ఉన్నా, లులూ సంస్థ ఏ పనులు ప్రారంభింలేదన్నారు. ఇదంతా కేవలం గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిందన్నారు. ప్రస్తుతం ఏపీఐఐసీ వద్ద టెక్నాలజీ ఉందని, దానిని ఉపయోగించుకుని అధునాతన భవనాలు నిర్మించగలమన్నారు.
*చిత్రం... రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి