ఆంధ్రప్రదేశ్‌

శ్రీశైలం డ్యాంపై అనుమానాలు వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: శ్రీశైలం ప్రాజెక్టుకు, డ్యామ్ భద్రతకు ఎలాంటి ముప్పులేదని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. డ్యామ్ భద్రతకు ముప్పు పొంచి ఉందన్న ప్రచారం నేపథ్యంలో ఆ శాఖ అధికారుల నుంచి నివేదికలు తెప్పించుకుని, వివరాలను పరిశీలించారు. అనంతరం డ్యామ్ భద్రతకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. కొన్ని మీడియా సంస్థలు చేస్తున్న ఆరోపణలు సత్యదూరమని, ప్రజల్లో లేనిపోని అపోహలు, అనుమానాలు సృష్టించవద్దని విజ్ఞప్తి చేశారు.
*చిత్రం... మంత్రి అనీల్