ఆంధ్రప్రదేశ్‌

అవినీతి నిర్మూలనతోనే పారదర్శక పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 21: రాష్ట్రంలో అవినీతి రహిత, పారదర్శక విధానాలకు పెద్దపీట వేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ప్రభుత్వంలోని కీలక విభాగాల్లో అవినీతికి ఆస్కారమున్న అంశాలను గుర్తించి, నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలపై సిఫారసుల కోసం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఆహ్మదాబాద్)తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో గురువారం జరిగిన అవగాహనా ఒప్పందంపై ఐఐఎం ప్రజా విధానాల బృందం ప్రతినిధి ప్రొఫెసర్ సుందరవల్లి నారాయణస్వామి, ఏసీబీ చీఫ్ విశ్వజిత్ సంతకాలు చేశారు. ఒప్పందం ప్రకారం.. మండల రెవెన్యూ కార్యాలయాలు, మండల అభివృద్ధి కార్యాలయాలు, మున్సిపల్ ప్లానింగ్ విభాగాలు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు, గ్రామ, వార్డు సచివాలయాలు సహా వివిధ శాఖలపై ఐఐఎం సమగ్ర అధ్యయనం చేస్తుంది. అవినీతికి ఆస్కారమున్న అంశాలను అధ్యయనం చేయటంతో పాటు అవినీతిని నిర్మూలించేందుకు అవసరమైన చర్యలను సిఫారసు చేస్తుంది. ఆయా ప్రభుత్వ శాఖల్లో నిర్మాణాత్మక మార్పులను సూచించడమే కాకుండా అవినీతి నిర్మూలనకు వ్యూహాలను ప్రభుత్వానికి నివేదిస్తుంది. కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థలను అవినీతికి దూరంగా ఉంచేందుకు సూచనలు చేస్తుంది. నిర్దేశించిన ప్రభుత్వ శాఖల ఉద్దేశాలు, విధానాలు అమలు చేస్తున్న తీరు, విభాగాల పాత్ర, పరిపాలన పరమైన పదవులు, వనరులు, ఆదాయాలను క్షుణంగా అధ్యయనం చేస్తుంది. పరిపాలనలో ఉన్న లోపాలను గుర్తించి, మెరుగైన పాలనకు అవసరమైన సూచనలు చేస్తుంది. ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు సామర్థ్యాన్ని పెంపొందించడం, మెరుగైన ఫలితాలు రాబట్టం ఎలా అన్న అంశాలను నివేదికలో పొందుపరుస్తుంది. అవినీతిని నిర్మూలించడానికి ఆయా విభాగాల్లో పరిపాలనా పరమైన మార్పులను కూడా సూచిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వంతో ఈ ఒప్పందం చేసుకోవడం తమకు లభిస్తున్న గౌరవంగా భావిస్తున్నామని సుందరవల్లి తెలిపారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ అవినీతి నిర్మూలన వల్ల అంతిమంగా సామాన్యులు, పేదలు
లబ్ధి పొందుతారన్నారు. ప్రభుత్వం చేపడుతున్న వివిధ పథకాలల్లో అవినీతి, వివక్షకు తావు లేకుండా పారదర్శకంగా అందరికీ అందుతాయన్నారు. పరిపాలనలో పారదర్శకత, అవినీతి రహిత విధానాల గురించి ఐఐఎం ప్రతినిధులకు వివరించారు. గతంలో ఏ పని కావాలన్నా మండల కార్యాలయాలకు వెళ్లే వారన్నారు. అక్కడకు వెళితేనే పనులు కాని పరిస్థితి వల్ల అవినీతి, పక్షపాతానికి, వివక్షకు ఆస్కారం ఏర్పడిందన్నారు. అందుకే అధికార వికేంద్రీకరణకు వీలుగా సచివాలయ వ్యవస్థ తెచ్చామన్నారు. జనవరి 1 నుంచి ఇది పూర్తి స్థాయిలో పని చేయడం ప్రారంభిస్తుందన్నారు. గతంలో మండల కార్యాలయాల్లో జరిగే పనులు ఇకపై వార్డు, గ్రామ సచివాలయాల్లో జరుగుతాయని వివరించారు. గ్రామ సచివాలయంతో ఎమ్మార్వో, కలెక్టర్ కార్యాలయం ఒక బటన్‌తో అనుసంధానం అవుతాయన్నారు. ఇందుకు అవసరమైన ఐటి నెట్‌వర్కును ఏర్పాటు చేస్తున్నామన్నారు. అవినీతికి తావు లేకుండా అర్హులందరికీ మంచి జరగాలన్నదే తమ ఉద్దేశ్యమని వివరించారు.

*చిత్రం... ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఐఐఎం (అహ్మదాబాద్)తో ఎంఓయూ ఒప్పంద పత్రాలను మార్చుకుంటున్న అధికారులు..చిత్రంలో ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్