ఆంధ్రప్రదేశ్‌

సీమ బంద్ సంపూర్ణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప/అనంతపుం.కర్నూలు, సెప్టెంబర్ 10: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం వైకాపా, వామపక్షాల ఆధ్వర్యంలో శనివారం సీమలో బంద్ ప్రశాంతగా జరిగింది. కడప ,అనంతపురం, కర్నూలు జిల్లాలో బంద్ ప్రశాంతంగా జరిగింది. పలువురు వైకాపా, కాంగ్రెస్, వామపక్షాల నాయకులను పోలీసులు ఎక్కడికక్కడే అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బంద్ సందర్భంగా అన్ని ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు మూతబడ్డాయి. కడపలాపురం, బద్వేలులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రధాని నరేంద్రమోదీ దిష్టిబొమ్మల దగ్గానికి ఆందోళనకారులు యత్నించగా పోలీసులు అరెస్టుచేశారు.
కడప ఎంపి వైఎస్ అవినాష్‌రెడ్డి, మాజీ ఎంపి వైఎస్ వివేకానందరెడ్డి, వైసిపి జిల్లా అధ్యక్షుడు ఎ.అమరనాధరెడ్డి తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. అనంతపురం జిల్లాలో విజయవంతమైంది. జిల్లా వ్యాప్తంగా వైకాపా, వామపక్షాల నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టుచేసి స్టేషన్లకు తరలించారు. సిపిఎం రాష్ట్ర నాయకుడు ఓబులు, జిల్లా కార్యదర్శి రాంభూపాల్, సిపిఐ జిల్లా కార్యదర్శి జగదీష్, వైకాపా నేత, మాజీ ఎంపి అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ, యువనేత చవ్వా రాజశేఖరరెడ్డిని పోలీసులు అరెస్టుచేశారు. ఎస్కేయూలో ఐక్యవిద్యార్థి సంఘం నేతృత్వంలో బంద్ నిర్వహించారు.
కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ రహదారిని దిగ్బంధించారు. తుంగభద్ర నది వంతెన వద్ద ఉదయం 10 గంటలకు పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి, కేంద్ర మాజీమంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి తదతరులు బైఠాయించి నిరసన తెలిపారు.
వైకాపా నేతలు గృహనిర్భంధం
తిరుపతి/నెల్లూరు/ఒంగోలు,: హోదా కావాలంటూ వైకాపా, వామపక్షాలు, కాంగ్రెస్ విద్యార్థి , ప్రజా సంఘాలు శనివారం చేపట్టిన బంద్ పాక్షికంగా సాగింది. వైకాపా రాష్ట్ర కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డిని తెల్లవారు జామున 4 గంటలకే తిరుపతిలోని ఆయన ఇంటి వద్దకు భారీ ఎత్తున పోలీసులు వాహనాలతో తరలివెళ్లి అరెస్ట్‌చేసి తిరుచానూరుకు తరలించారు. ప్రకాశం జిల్లాలో బంద్ సందర్బంగా ఒంగోలు పార్లమెంటుసభ్యుడు వైవి సుబ్బారెడ్డిని ఆయన స్వగృహంలో గృహనిర్బంధం చేశారు. నెల్లూరు జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో సంపూర్తిగా, మరికొన్ని చోట్ల పాక్షికంగా జరిగింది.

చిత్రం.. ఒంగోలులో ఎంపి వైవి సుబ్బారెడ్డి తదితరుల ఆందోళన