ఆంధ్రప్రదేశ్‌

బంద్ ప్రశాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ/గుంటూరు, సెప్టెంబర్ 10: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటించి విభజన హామీలన్నింటిని అమలుచేయాలని డిమాండ్ చేస్తూ వామపక్షాలు, ప్రత్యేక హోదా సాధన సమితి, కాంగ్రెస్, వైసిపి ఆధ్వర్యంలో శనివారం జరిగిన రాష్ట్ర వ్యాప్త బంద్ ఎంతో ప్రశాంతంగా, స్వచ్ఛందంగా విజయవంతమైంది. రాష్ట్రంలో తొలిసారిగా డ్రోన్ల సాయంతో ఏర్పాటు చేసిన నిఘాను డిజిపి నండూరి సాంబశివరావు తన కార్యాలయంలో కూర్చుని స్వయంగా పర్యవేక్షించారు. రెండో శనివారం సెలవుదినం కావటంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, జాతీయ బ్యాంకులు పూర్తిగా మూతబడ్డాయి. వ్యాపార, వాణిజ్య సంస్థల యజమానులు స్వచ్ఛందంగా తమ దుకాణాలను మూసి బంద్‌కు సహకరించారు. సినిమాహాళ్లలో ఉదయం ఆటలు రద్దయ్యాయి. ఈదఫా బంద్‌కు యువకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో మద్దతు తెలిపారు. ఎన్నికల హామీ ప్రకారం నేటికి నిరుద్యోగ భృతిపై సిఎం నోరు మెదపకపోవటం కూడా దీనికి కారణంగా కనిపించింది. బంద్ సందర్భంగా రాష్టవ్య్రాప్తంగా పోలీసులు 9,200 మందిని అరెస్ట్ చేశారు. విజయవాడలో 150 మందికి పైగా ఆందోళనకారులు అరెస్టయ్యారు. ప్రముఖుల్లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, వైకాపా జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి కెపి సారథి, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లాది విష్ణు, పిసిసి అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ, సిపిఎం నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాథ్, తదితరులు అరెస్టయ్యారు. ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు, సినీ నటుడు శివాజీ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తదితరులు ప్రత్యేక వాహనంలో నగరమంతటా తిరుగుతూ బంద్‌ను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ప్రత్యేక హోదా సాధనే తమ అంతిమ లక్ష్యమన్నారు. ప్రభుత్వం ఈ బంద్‌ను విఫలం చేసేందుకు విశ్వప్రయత్నం చేసిందని, అరెస్టులతో ఆంధ్రుల ఆవేదనను ఆపలేరన్నారు. వైసిపి ఇచ్చిన పిలుపులో భాగంగా శనివారం గుంటూరు జిల్లాలో నిర్వహించిన బంద్ చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుంచే వైసిపి, సిపిఐ, సిపిఎం, ప్రజాసంఘాల నాయకులు రోడ్లపైకి వచ్చి బైక్ ర్యాలీలు, ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. హైదరాబాద్ నుంచి సత్తెనపల్లి నియోజకవర్గంలోకి అడుగుపెట్టిన వైసిపి రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, అనుచరులను పిడుగురాళ్ల రూరల్ సిఐ శ్రీ్ధర్‌రెడ్డి, రాజుపాలెం ఎస్‌ఐ అనిల్‌కుమార్ తమ సిబ్బందితో అదుపులోకి తీసుకుని రాజుపాలెం పోలీసుస్టేషన్‌కు తరలించారు. గుంటూరు నగరంలో ఆందోళన నిర్వహిస్తున్న వైసిపి నేతలు లేళ్ల అప్పిరెడ్డి, రోశయ్య, పానుగంటి చైతన్య, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్, మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు తదితర నాయకులను అరెస్ట్‌చేసి ఠాణాలకు తరలించారు.
కేంద్రం చేతిలో బాబు కీలుబొమ్మ..
కర్నూలు సిటీ: ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మగా మారి రాష్ట్ర ప్రజలను దగా చేస్తున్నాడని పిసిసి అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శనివారం కాంగ్రెస్ పార్టీ, వామపక్షాల ఆధ్వర్యంలో కర్నూలులో జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక హోదా సంజీవిని కాదని ప్యాకేజీయే ముద్దంటూ ముఖ్యమంత్రి దానివైపే మొగ్గుచూపడంలో గల మతలలబు ఏమిటని ప్రశ్నించారు.

చిత్రాలు..కర్నూలు హైవేపై బైఠాయించిన రిఘువీరారెడ్డి, కేంద్ర మాజీమంత్రి కోట్ల తదితరులు