ఆంధ్రప్రదేశ్‌

బిరుదులు, అవార్డులపై మోజు లేదు: విశ్వనాథ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం కల్చరల్, సెప్టెంబర్ 11: బిరుదులు, అవార్డులపై తనకు నమ్మకం లేదని చెప్పను కానీ, వాటిపై తాను మోజు పెంచుకోలేదని ప్రముఖ సినీ సంగీత దర్శకుడు కాశీనాథ్ విశ్వనాథ్ పేర్కొన్నారు. అనంతపురం నగరంలోని శ్రీత్యాగరాజ సంగీతసభ 58వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం నిర్వహించగా కె.విశ్వనాథ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో అతిరథ మహారథులైన సంగీత విద్వాంసులు ప్రదర్శనలిచ్చి, సత్కారం అందుకున్న వేదికపై తాను పాల్గొని, సత్కారం అందుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇది తనకు సాగర సంగమం చిత్రంలోని సన్నివేశాన్ని గుర్తుచేస్తోందన్నారు.
శోభాయమానంగా కళకళలాడుతున్న సభను చూస్తుంటే అందులో అమ్మ కనిపిస్తోందన్నారు. అలాగే శాస్ర్తియ సంగీతం పట్ల ఇక్కడి ప్రజలకు ఉన్న ఆసక్తి కూడా తనకు ఆనందాన్నిచ్చిందన్నారు. ఈ సందర్భంగా తనకు శంకరశాస్ర్తీగారి మాటలు గుర్తుకు వస్తున్నాయన్నారు. ప్రస్తుతం తాను సినిమాలకు దూరంగా ఉన్నానని, అయినప్పటికీ సన్మానం చేయడమంటే శంకరాభరణం, సాగరసంగమం లాంటి చిత్రాలవల్లే అన్నారు. తనకు దక్కిన కీర్తికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. కార్యక్రమంలో శ్రీత్యాగరాజ సంగీత సభ అధ్యక్షుడు ఏజి.వేణుగోపాల్‌రావు, విశ్రాంత డిజిపి రొద్దం ప్రభాకరరావు, జ్ఞానేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.