ఆంధ్రప్రదేశ్‌

తెల్లకార్డుదారులందరికీ ఏప్రిల్ నాటికి నాణ్యమైన బియ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాష్ట్రంలోని తెల్లకార్డుదారులందరికీ ఏప్రిల్ నుంచి నాణ్యమైన బియ్యం అందిస్తామని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి శాసనసభలో ప్రకటించారు. ప్రస్తుత శాసనసభ సమావేశాల్లో రెండో రోజైన మంగళవారం ప్రశ్నోత్తరాలలో టీడీపీ సభ్యులు కె అచ్చెన్నాయుడు, నిమ్మల రామనాయుడు, డోలా బాల వీరాంజనేయస్వామి, అశోక్ బెందాళం, కరణం బలరామకృష్ణమూర్తి ‘తెల్ల రేషన్‌కార్డుదారులకు సన్నబియ్యం’ అంశంపై ప్రస్తావించిన అంశం చిలికి... చిలికి గాలివానగా మారి ఈ తొలి ప్రశ్నపైనే గంట సేపు వాడివేడి చర్చ జరిగింది. ప్రధానంగా ఈ సన్న బియ్యంపై గతంలో సాక్షిలో ప్రచురితమైన వార్తా కథనాలకు సీఎం జగన్ తొలిసారిగా తమ జర్నలిస్టులు సన్న..స్వర్ణ బియ్యంకు తేడా తెలియక పొరబాటున వార్తలు రాశారంటూ అంగీకరించారు. అయితే అదే రోజున టీడీపీ గెజిట్‌లా భావించే మీడియాలు నాణ్యమైన బియ్యం అంటూ ప్రచురించాయి. ప్రసారం చేసాయి కదా అంటూ పైలెట్ ప్రాజెక్టు కింద శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో తాను ప్రారంభించిన ఇంటింటికీ నాణ్యమైన బియ్యం పథకం ప్రారంభ సభలో నాడు ఈటీవీలో ప్రసారమైన తన ప్రసంగాన్ని సభలో ఉన్న టీవీల ద్వారా చూపించారు. ఈ చర్చ ప్రారంభంలో
ముందుగా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, టీడీపీ సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అచ్చెన్నాయుడు, నిమ్మల రామనాయుడు పత్రికల్లో రాయలేని భాషలో ఒకరినొకరు దుర్భాషలాడుకున్నారు. పైగా చేతులు ఎత్తి సవాళ్లు విసురుకున్నారు. తొలుత టీడీపీ ఉప నాయకులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామనాయుడు తెల్లకార్డుదారులందరికీ సన్న బియ్యాన్ని సరఫరా చేస్తామన్నారు... పైగా వలంటీర్‌ల ద్వారా సరఫరా చేస్తామన్నారు. ఇక వలంటీర్లు వలనే అత్యధిక మంది రేషన్‌కు నోచుకోవటం లేదన్నారు. బియ్యం ప్యాకింగ్‌లోనే అవకతవకలు జరుగుతున్నాయని అన్నారు. అయితే మంత్రి కొడాలి నాని తన సమాధానంలో ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో ఒక పైలెట్ కార్యక్రమంగా మెరుగైన మంచి నాణ్యత ప్రమాణాలు గల స్వర్ణ మరియు తత్ సమానమైన రకాల బియ్యాన్ని పంపిణీ చేస్తున్నామని ఆ జిల్లాలో గత నవంబర్‌లో 7.45 లక్షల కుటుంబాలకు ప్యాకింగ్ చేసిన మెరుగైన స్వర్ణ, తత్ సమానమైన రకాల బియ్యాన్ని వారి వారి ఇంటి వద్దకే అందచేసామన్నారు. దీనిపై నిమ్మల రామానాయుడు తీవ్ర అభ్యంతరం తెలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్నాం, సేకరిస్తున్నామంటూ మంత్రివర్గ ఉప సంఘ సభ్యులు చేసిన ప్రకటనలు ప్రస్తుత ప్రభుత్వ గెజిట్ సాక్షిలో ప్రముఖంగా ప్రచురితమయ్యాయంటూ వాటి ప్రతులను చూపించారు. సహజంగా రైస్ మిల్లర్ అయిన మంత్రివర్గ ఉప సంఘ సభ్యులు శ్రీ రంగనాథరాజు మాట్లాడుతూ ఎంత ఖర్చయినా పేద ప్రజలందరికీ నాణ్యమైన 7029 స్వర్ణ వెరైటీ బియ్యం అందించాలన్న దృష్టితో గతం కంటే రూ. 1400 కోట్లు అధికంగా వెచ్చిస్తూ వచ్చే ఏప్రిల్ నాటికి రాష్టమ్రంతటా ఇదే బియ్యాన్ని సరఫరా చేయడానికై ప్రస్తుత ఖరీప్, రబీ సీజన్‌లలో ఆరు మాసాల ముందుగానే 25 లక్షల టన్నుల బియ్యం సేకరిస్తున్నామన్నారు. మంత్రి కొడాలి నాని ఆవేశంతో మాట్లాడుతూ బుచ్చయ్యా కూర్చో... అచ్చెన్నాయుడుకి శరీరం ఉంది. నాలెడ్జి శరీరంలో కాదు మైండ్‌లో ఉండాలి... ప్రతిపక్ష నేత చంద్రబాబు ఒక్కసారి తన కళ్ల అద్దాలు సరి చూసుకుని చూడాలనగా ఓ వైపు విపక్ష సభ్యులు ఎదురుదాడికి దిగుతుండగా చంద్రబాబు ఠక్కున తన కళ్ల జోడను తీసివేసి టేబుల్‌పై ఉంచారు. అధికారపక్ష సభ్యులు కొందరు లేచి ఏదైన ఉంటే బయట మాట్లాడుకోండి అంటూ కేకలు వేశారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ హయాంలో రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ కుప్పకూలిపోయిందన్నారు. చిరరగా సీఎం జగన్ మాట్లాడుతూ ఏప్రిల్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రూ. 1400 కోట్లు అదనంగా వెచ్చించి పేదలకు నాణ్యమైన బియ్యాన్ని అందజేస్తామన్నారు. తన ఎన్నికల ప్రణాళికలో ఎక్కడా బియ్యం సంగతి లేకపోయినా ప్రతి ఒక్కరికీ నాణ్యమైన బియ్యం అందించాలనే తపనపడుతున్నామన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రస్తుతం ఏ ఒక్కరూ తమ బియ్యాన్ని అమ్ముకోకుండా ఆనందంగా తింటున్నారన్నారు. టీడీపీకి వారి ఎన్నికల ప్రణాళికపై ఎలాంటి గౌరవం లేకుండా చెత్త బుట్టలో వేసి చివరకు ఆన్‌లైన్ నుంచి తొలగించారని అన్నారు. అయితే తాము మాత్రం ఎన్నికల ప్రణాళికను బైబిల్, ఖురాన్, భగవద్గీతగా భావిస్తూ ముందుకు సాగుతున్నామన్నారు. చంద్రబాబు హయాంలో పంపిణీ అయిన బియ్యాన్ని ప్రజలు తినలేక డీలర్లకు అమ్మితే, వారు మిల్లర్లకు అమ్మేవారన్నారు. వాటినే రీ పాలిష్ చేసి మళ్లీ ప్రభుత్వానికే అంటగడుతుండేవారని అన్నారు. ప్రజలు తినలేని బియ్యాన్ని దూరంగా ఉంచి శ్రీకాకుళం నుంచి నాణ్యమైన బియ్యాన్ని అందించడం ప్రారంభించామన్నారు. గత బియ్యంలో 25 శాతం నూకలు ఉంటే ప్రస్తుతం 15 శాతం...డామేజీ శాతం మూడు నుంచి 0.75కు తగ్గించగల్గామన్నారు. నాణ్యమైన బియ్యాన్నికి సన్న బియ్యానికి తేడా తెలియక తికమక పడవద్దు... గతంలో తామ చెప్పినట్లుగా నాణ్యమైన బియ్యాన్ని అందిస్తుంటే ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నారంటూ జగన్ విపక్షాలను ప్రశ్నించారు.

*చిత్రం...అసెంబ్లీలో చర్చ సందర్భంగా తమ ఎన్నికల మేనిఫెస్టో ప్రదర్శిస్తున్న ముఖ్యమంత్రి జగన్