ఆంధ్రప్రదేశ్‌

పెంచిన చార్జీలు తగ్గించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, డిసెంబర్ 11: పెంచిన ఆర్టీసీ చార్జీలను ఉపసంహరించుకోవాలంటూ టీడీపీ ఎమ్మెల్సీలు నినాదాలతో శాసన మండలిని హోరెత్తించారు. వెల్‌లో నిలబడి నినాదాలు చేయడంతో శాసన మండలి కార్యకలాపాలు బుధవారం స్తంభించాయి. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. మూడు సార్లు వాయిదా అనంతరం కూడా సభ ఆర్డర్‌లోకి రాకపోవడంతో గురువారానికి వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం ప్రకటించారు. బుధవారం శాసన మండలి సమావేశం ప్రారంభం కాగానే ఆర్టీసీ చార్జీల పెంపుపై టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లు మండలి చైర్మన్ షరీఫ్ ప్రకటించారు. దీంతో టీడీపీ సభ్యులందరూ లేచి నిలబడి ప్రజలపై 1000 కోట్ల రూపాయల మేర భారం పడుతోందని, చార్జీల పెంపును రద్దు చేయాలని, ఈ అంశంపై చర్చకు అనుమతించాలని కోరారు. వాయిదా తీర్మానాన్ని తిరస్కరించామని, వేరే ఫార్మాట్‌లో వస్తే చర్చకు అనుమతిస్తామని చైర్మన్ చెప్పారు. టీడీపీ సభ్యుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ సామాన్యుడిపై ఇంత కక్ష ఎందుకు అని ప్రశ్నించారు. బీజేపీ సభ్యుడు మాధవ్ మాట్లాడుతూ ప్రజలపై భారం వేయడం సరికాదన్నారు. విలీన భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని చెప్పిందని గుర్తు చేశారు.
టీడీపీ సభ్యులు నల్లబ్యాడ్జీలతో వెల్‌లోకి వచ్చి నినాదాలు చేయడం ప్రారంభించారు. నారా లోకేష్, టీడీ జనార్ధన్, బుద్దా నాగజగదీశ్వరరావు, బచ్చుల అర్జునుడు, జి.శ్రీనివాసులు తదితరులు వెల్‌లో నినాదాలు చేశారు. ప్రజలపై 1000 కోట్ల భారాన్ని తగ్గించాలని, పెంచిన ఆర్టీసీ చార్జీలను రద్దు చేయాలని నినాదాలు చేశారు. ఒక దశలో జి.శ్రీనివాసులు అక్కడ బైఠాయించారు. ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ మాట్లాడేందుకు ప్రయత్నించినప్పటికీ, సభ ఆర్డర్‌లో లేకపోవడంతో విరమించుకున్నారు. చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతి రోజూ సభ నిర్వహణకు ఆటంకం కలుగ చేస్తున్నారని విమర్శించారు. చైర్మన్ విజ్ఞప్తిని కూడా పట్టించుకోకపోవడం లేదన్నారు. ఆర్టీసీని కాపాడాలని ప్రయత్నిస్తున్నామని తెలిపారు. దాదాపు 6000 కోట్ల రూపాయల మేర అప్పులు ఉన్నాయన్నారు. దీంతో స్వల్పంగా చార్జీలు పెంచారన్నారు. గలాట చేసేందుకు, గోల చేసేందుకు వస్తున్నారని విమర్శించారు.
ఈ దశలో సభను కొద్ది సేపు వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. తిరిగి సమావేశమయ్యాక కూడా టీడీపీ సభ్యులు నినాదాలు కొనసాగించారు. టీడీపీ పక్ష నేత యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ చార్జీల పెంపు రద్దు చేస్తున్నట్లు ముందు ప్రకటించాలని, తరువాత ఆర్టీసీ గురించి చర్చిద్దామన్నారు. దీనికి మంత్రి సుభాష్ చంద్రబోస్ బదులిస్తూ ఆర్టీసీ అప్పులు చేస్తే ఆ భారం ఎవరిపై పడుతుందని ప్రశ్నించారు. సభ ఆర్డర్‌లో లేదంటూ మరోసారి కొద్ది సేపు వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. తిరిగి సమావేశమైనప్పటికీ, టీడీపీ సభ్యులు నినాదాలు కొనసాగించారు. ప్రజా సమస్యలు చర్చకు రాకుండా చేసే పని ఇది అంటూ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు.
టీడీపీ హయాంలో 6500 కోట్ల రూపాయల అప్పు చేశారని, ఈ భారం ఎవరిపై పడుతుందని మంత్రి సుభాష్ చంద్రబోస్ ప్రశ్నించారు. ఆర్టీసీని టీడీపీ భ్రష్టు పట్టించిందని, రాజకీయ కోణంలోనే ఈ అందోళన చేస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. తాము చర్చకు సిద్ధమని, తమ వ్యవహారాలు ఎక్కడ బయటపడతాయోనని చర్చకు టీడీపీ రావడం లేదని ఆరోపించారు. దీనిపై యనమల స్పందిస్తూ, రెండు అంశాలు వేర్వేరన్నారు. చార్జీల పెంపు రద్దు చేస్తే, ఆర్టీసీ పనితీరుపై చర్చిద్దామన్నారు. నినాదాలు కొనసాగుతుండటంతో సభను మరోసారి వాయిదా వేశారు. తిరిగి సమావేశమైనప్పటికీ టీడీపీ సభ్యులు నినాదాలు కొనసాగించారు. దీంతో మరోసారి సభను వాయిదా వేశారు. మధ్యాహ్నం 1.35 గంటలకు సభ మరోసారి సమావేశమైంది. టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తుండగా, చైర్‌లో ఉన్న డిప్యూటీ చైర్మన్ సుబ్రహ్మణ్యం సభను ఆర్డర్‌లోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. ఉల్లి సమస్యపై చర్చిద్దామని, సభ్యులు సహకరిస్తే, మంత్రిని రప్పిస్తానని తెలిపారు. ఇప్పటికే మూడు సార్లు సభ వాయిదా పడిందని, సహకరించాలని కోరారు. మంత్రి బోత్స జోక్యం చేసుకుని, ఉల్లిపై చర్చకు పట్టుబట్టడంతో చర్చకు నిర్ణయించామని గుర్తు చేశారు. ప్రభుత్వం సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉందంటే వెనుకంజ వేస్తారని విమర్శించారు. సభ ఆర్డర్‌లోకి రాకపోవడంతో సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ చైర్మన్ ప్రకటించారు. దీంతో బుధవారం నాటి ప్రశ్నోత్తరాలు, స్వల్పకాలిక వ్యవధి చర్చ జరగలేదు.