ఆంధ్రప్రదేశ్‌

ఇన్ని అబద్ధాలా.. సిగ్గుందా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: ఆంగ్ల మాధ్యమంలో బోధనను తాను వ్యతిరేకించినట్లు ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆక్షేపించారు. గురువారం శాసనసభలో ఇంగ్లీష్ మీడియంపై చర్చ సందర్భంగా చంద్రబాబు చేసిన ఆరోపణలపై సీఎం జగన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంగ్ల
మాధ్యమమే కాదు.. తనకు వ్యితిరేకంగా ఏ కథనాలు రాయాలన్నా చంద్రబాబు మీడియా సై అంటుందని, దాన్ని చూపి తనపై అసత్య ఆరోపణలు చేయటం తగదన్నారు. 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకుంటున్న ఆయన అధికారంలో ఉండగా పేద వర్గాలను విస్మరించారని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో 45వేల పాఠశాలలను ఇంగ్లీష్ మీడియంలోకి మార్చే అవకాశం ఉన్నప్పటికీ 34 శాతం మాత్రమే అమలు చేశారని ఇందుకు చంద్రబాబు సిగ్గుతో తలదించుకోవాలన్నారు. నారాయణ, శ్రీచైతన్య విద్యా సంస్థలకు మేలు చేసి వాటాలు పంచుకుని ప్రభుత్వ విద్యా సంస్థల్ని భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. మీడియాలో వచ్చిన కథనాలు కాదు.. మీరేం చేశారు.. నేనేం చేశానో తేల్చుకుందామని సవాల్ విసిరారు. ఇంతలో చంద్రబాబు జోక్యం చేసుకుని ఆంగ్లంలో బోధనను మీరు వ్యతిరేకించినట్లు స్పష్టంగా ఉందని మీరే ఆంగ్ల మాధ్యమాన్ని తెచ్చినట్లు అసత్యాలు ప్రచారం చేసుకుంటున్నారని అభ్యంతరం తెలిపారు. అవినీతి డబ్బుతో పెట్టుకున్న సొంత పత్రికపైనే విశ్వసనీయత లేకపోతే అది చెత్త పేపరా.. అని ప్రశ్నించారు. దీంతో ఆగ్రహించిన ముఖ్యమంత్రి జగన్ అసలు నీకు బుద్ధి..జ్ఞానం ఉందా.. అదేమంటే కళ్లు పెద్దవి చేస్తావు.. మేం భయపడం.. మనిషి పెరగటం కాదు.. బుద్ధి పెరగాలన్నారు. నేను వ్యతిరేకించినట్లుగా పత్రికల్లో వస్తే నిరూపించాలని మరోసారి సవాల్ విసిరారు. జగన్ అనే వాడి గురించి మాట్లాడే ముందు దమ్ము, ధైర్యం, నిజాయితీ, సిగ్గు ఉండాలని వ్యాఖ్యానించారు. మీ ఎల్లో మీడియాలో వచ్చిన కథనాలపై నేను స్పందిస్తే అసెంబ్లీ ఎలా ఉంటుందో గ్రహించాలన్నారు. మీడియా గురించి సభలో అప్రస్తుతమన్నారు. తమ ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియంను అమల్లోకి తెస్తుంటే సహించలేక అడ్డుకునేందుకు రకరకాల కుట్రలకు పాల్పడ్డారని మండిపడ్డారు. ఒక సామాజికవర్గంతో సహా, కొన్ని మీడియా సంస్థలు, కొందరు వ్యక్తులు అడ్డుకునేందుకు సర్వశక్తులు ఒడ్డారని ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు వంటి జాతీయ నేత కూడా దీన్ని వ్యతిరేకించారని విమర్శించారు. ప్రజా ఉద్యమంతో చంద్రబాబు వెన్నుల్లో వణుకు పుట్టిందని భయంతో ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని వ్యాఖ్యానించారు. నిజంగా చిత్త శుద్ది ఉంటే పేద వర్గాల పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదివించే వారన్నారు. ఐదేళ్లు పాలనలో అవకాశం ఉన్నప్పటికీ పేదవర్గాలను అణచివేయాలనే ధోరణితోనే అమలు చేయలేదన్నారు. వాస్తవాలు చెబితే సిగ్గుతో తల దించుకునే పరిస్థితి వస్తుందన్నారు.

*చిత్రం...ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి