ఆంధ్రప్రదేశ్‌

కలుషితాహారంతో 14 మందికి అస్వస్థత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సారవకోట, డిసెంబర్ 12: శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలంలోని సవరబొంతు గిరిజన బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల విద్యార్థినులు 14 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరి అస్వస్థతకు కలుషిత ఆహారమే ప్రాథమిక కారణంగా తెలుస్తోంది. మెనూ ప్రకారం మంగళవారం రాత్రి మాంసం తిన్నాక బుధవారం సాయంత్రం నుండి ఒక్కో విద్యార్థిని విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. ఆరు నుంచి 9 తరగతుల విద్యార్థిణులు 10 మంది అస్వస్థతకు గురికావడంతో డిప్యూటీ వార్డెన్ పాపారావు, హెచ్‌ఎం లక్ష్మీబాయి, ఐటీడీఏ అధికారులు, బొంతు పీహెచ్‌సీ వైద్యాధికారికి సమాచారం అందించగా స్పందించిన వైద్యాధికారి రమేష్‌నాయుడు సిబ్బందితో పాఠశాలకు వచ్చి విద్యార్థిణులను ప్రత్యేక గదిలో ఉంచి వైద్యం అందించారు. గురువారం ఉదయం కూడా మరో నలుగురు అస్వస్థతకు గురి కాగా ప్రస్తుతం వారందరూ చికిత్స తీసుకుంటన్నారు.