తెలంగాణ

శాఖల విలీనం వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 11: వ్యవసాయ అనుబంధ శాఖలైన ఉద్యానవన, సెరికల్చర్‌లను విలీనం చేసి జి ల్లా స్థాయిలో ఒకే అధికారిని నియమించాలనే ప్రతిపాదనను ప్రభు త్వం విరమించుకోవాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేసిం ది. గ్రామీణ ప్రాంతలో 62 శాతం జనాభా వ్యవసాయంపైనే ఆధారపడి ఉందని, వీరికి వ్యవసాయమే జీవనాధారమని, ఈ రంగం అభివృద్ధికి కృషిచేయాలని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు పి జంగారెడ్డి, బొంతల రాంచంద్రారెడ్డి కోరారు. వ్యవసాయ అధికారులను పంటల విస్తీర్ణం ఆధారంగా కేటాయించాలని, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి వ్యవసాయంపై రైతులకు తగు సూచనలు, సలహాలు అందించాలన్నారు. ఉద్యానవన శాఖ అధ్వర్యంలో సూక్ష్మ, సేద్యపరికరాలు అం దిస్తామని, ఇజ్రాయిల్ టెక్నాలజీని అమలు చేస్తామని భరోసా కల్పించిన ప్రభుత్వం డ్రిప్ కోసం పెట్టుకున్న దరఖాస్తులను పెండింగ్‌లో పెట్టిందని వారు ఆరోపించారు. ఇన్‌పుట్ సబ్సిడీ రైతులకు ఇవ్వలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. శాఖల విలీనాన్ని ఉపసంహరించుకొని రైతాంగాన్ని ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.