రాష్ట్రీయం

21న ఢిల్లీలో చంద్రుల భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 14: కావేరి నదీ జలాల పంపిణీ నేపథ్యంలో తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాన్ని చూసిన తర్వాత ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల అంశాన్ని త్వరితగతిన పరిష్కరించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఆంధ్ర, తెలంగాణ సిఎంలను అత్యున్నత మండలి సమావేశానికి రావాలని ఆహ్వానించింది. ఈ నెల 21న ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ సమక్షంలో తెలుగు రాష్ట్రాల సిఎంలు కెసిఆర్, చంద్రబాబు సమావేశం కానున్నారు. 21న సమావేశానికి రెండు రాష్ట్రాల సిఎంలు తమ సమ్మతిని తెలియచేశారు. ఈ సమావేశంలో కృష్ణా జలాల పంపిణీ ఫార్ములా చర్చకు రానుంది. సుప్రీం కోర్టు ఆదేశంపై ఈ సమావేశం జరగనుంది. ఆంధ్ర ప్రభుత్వం పట్టిసీమ ఎత్తిపోతల స్కీంను నిర్మించి గోదావరి జలాలను కృష్ణా నదిలోకి మళ్లించినందు వల్ల తమ వాటా 40 టిఎంసిని కృష్ణా జలాల్లో వాడుకుంటామని ఇప్పటికే కరాఖండిగా చెప్పింది. పోతిరెడ్డి పాడు ద్వారా నిర్దేశించిన దాని కంటే ఎక్కువ జలాలను రాయలసీమకు మళ్లించారని తెలంగాణ అభియోగం. కాగా తెలంగాణ ప్రభుత్వం డిపిఆర్‌లు లేకుండా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల స్కీం, డిండి ఎత్తిపోతల స్కీంను నిర్మిస్తోందని, వీటిని అడ్డుకోవాలని ఆంధ్ర ప్రభుత్వం కేంద్రానికి, సుప్రీం కోర్టుకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఈ నెల 21వ తేదీన రెండు రాష్ట్రాల సిఎంలకు మధ్య జరిగే సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.