తెలంగాణ

నరుూం కేసు దర్యాప్తు ముమ్మరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 14: గ్యాంగ్‌స్టర్ నరుూం అక్రమ వ్యవహారాలపై ప్రత్యేక సిట్ బృందం దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటి వరకు నరుూం కుటుంబీకులు, అనుచరులు మాత్రమే అరెస్టయ్యారు. నామమాత్రంగా ఒకరిద్దరు రాజకీయ నాయకులు రిమాండ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటుండగా పోలీసు ఉన్నతాధికారుల పాత్రపై ప్రకటనలు వెలువడిన నేపథ్యంలో ఒక సిఐ స్థాయి అధికారి మాత్రం స్థానచలనానికే పరిమితమయ్యారు. అయితే నరుూం అక్రమాల్లో భాగస్వాములు, వసూళ్లు, వేధింపులు, హత్యలు, ఎవరికెంత నజరానాలు ముట్టిన సమాచారం డైరీలో పేర్కొనబడిందని సిట్ అధికారులు గుర్తించారు తప్ప అసలు ఎవరెవరున్నారనే విషయం బయటకు రావడం లేదు. ప్రస్తుతం నరుూం డైరీ పోలీస్ విచారణ అధికారుల వద్దే ఉండడంతో ఎవరి పేర్లు కూడా బయటకు పొక్కడం లేదు. సదరు డైరీ కోర్టుకు చేరితే గానీ నరుూం మొత్తం వ్యవహారం బయటపడదని, ఆ దిశగానే సిట్ ప్రత్యేక బృందం దర్యాప్తు చేపట్టినట్టు సమాచారం. నరుూం కేసులో మాజీ మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పలు పార్టీలకు చెందిన నాయకులు ఉన్నారని బలంగా వినబడుతున్నప్పటికీ ఎవరూ బయట పడడం లేదు. దీంతో ఈ కేసులో నరుూం డైరీయే కీలకమైంది.
సిట్ ఇప్పటి వరకు నరుూం అనుచరులపై 99కేసులు నమోదు చేసి 82మందిని అదుపులోకి తీసుకుంది. అయితే వీరిలో ఎక్కువ మంది నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు చెందిన నరుూం బంధువులు, అనుచరులు ఉన్నారు. పోలీస్ అధికారులు, నాయకులు ఉన్నట్టు ప్రచారం సాగుతున్నా వారెవరన్నది ఆయా పోలీస్ స్టేషన్లలో ఎఫ్‌ఐఆర్ నమోదైతే గానీ తెలిసే అవకాశం లేదు. ఇదిలావుండగా వినాయక నిమజ్జనోత్సవాలు జరుగుతున్నందున నరుూం డైరీని కోర్టుకు నివేదించడంలేదని, గణేశ నిమజ్జనోత్సవాల తరువాత సదరు డైరీని పోలీస్ ఉన్నతాధికారులు కోర్టుకు సమర్పించాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం. మొత్తం మీద నరుూం కేసు ఈ నెలాఖరులోగా ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా బుధవారం మహబూబ్‌నగర్ జిల్లాలో కిడ్నాప్, హత్య కేసుల్లో నిందితులైన సంజీవ్‌కుమార్, శ్రీను, సందీప్, కృష్ణ, రమేష్‌లను అరెస్టు చేశారు. నరుూంకు సంబంధించి సిట్‌కు 372 ఫిర్యాదు ఫోన్ కాల్స్ వచ్చాయని సిట్ చీఫ్ నాగిరెడ్డి తెలిపారు.
పోలీస్ కస్టడీలో నరుూం సోదరి..
గ్యాంగ్‌స్టర్ నరుూం అక్రమ దందాల్లో పాలుపంచుకున్న ఆయన సోదరి ఆయేషా, ఆమె భర్త సలీంను పోలీసులు రెండు రోజులు కస్టడీకి తీసుకొని విచారిస్తున్నారు. వీరిని ఇప్పటి వరకు మూడు సార్లు అధికారులు కస్టడీకి తీసుకొని విచారించినట్టు సమాచారం. వీరిని విచారించిన నేపథ్యంలో కొంత కీలక సమాచారం లభించిన దృష్ట్యా సిట్ అధికారులు వీరిని మళ్లీ కస్టడీకి తీసుకున్నారు. కాగా వీరి విచారణలో వెల్లడయ్యే విషయాలతో మరిన్ని అరెస్టులు జరగవచ్చని పోలీసులు భావిస్తున్నారు.