ఆంధ్రప్రదేశ్‌

ఆరుతడే బెటర్ .. సాగర్ ఆయకట్టు రైతులకు సిఎం సూచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబరు 16: భారీ వర్షాల వలన పంట నష్టపోయిన ప్రాంతాల్లో వివరాల సేకరణ తక్షణమే ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి శుక్రవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని, వారికి కలిగిన నష్టాన్ని భర్తీ చేయాలని ఆయన ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న ఇన్‌పుట్ సబ్సిడీ త్వరితగతిన అందేలా చూడాలని ఆదేశించారు. పులిచింతలలో 21 టిఎంసిల నీరు వచ్చిందని, ఇంకా ఐదు టిఎంసిలు వచ్చే అవకాశం ఉందని అన్నారు. నాగార్జునసాగర్ ఆయకట్టులో ప్రస్తుతం వర్షాలు కురిశాయి కాబట్టి వరికి బదులు ఆరుతడి పంటల సాగును ప్రోత్సహించాలని సూచించారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలుపడ్డ ప్రాంతాల్లో పప్పు్ధన్యాల విత్తనాలను సరఫరా చేయాలని సూచించారు. రాష్ట్రంలో నిర్వహిస్తున్న పరీక్షలు దేశంలోనే ఒక నమూనా అయిందని అన్నారు. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో వారం, నెలవారీగా ప్రగతి నివేదికలను సిద్ధం చేయాలని సిఎం ఆదేశించారు. అన్ని పంటల ఉత్పాదకతలో దేశంలోనే మన రాష్ట్రం నంబర్‌వన్‌గా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఉత్పాదనలో అంతర్జాతీయ ప్రమాణాలను అందుకోవాలని సిఎం సూచించారు. రాష్టవ్య్రాప్తంగా ఈ ఖరీఫ్ సీజన్‌లో వరిసాగు లక్షా 20వేల హెక్టార్లలో తగ్గిందని సిఎంకు అధికారులు తెలియచేశారు. ఈక్రాపింగ్ 40 శాతం మాత్రమే జరిగిందని, దానిని వేగవంతం చేయాలని సిఎం ఆదేశించారు.
అంటువ్యాధులు ప్రబలకుండా చూడండి
ఆ తరువాత జిల్లా కలెక్టర్లతో సిఎం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో ఏ ప్రాంతంలో విష జ్వరాలు, అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. హెల్త్ ఎమర్జన్సీలో చేపట్టినట్టే అన్ని రకాల చర్యలను యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
శెభాష్ బాబూ!
* కేంద్ర మంత్రి ప్రశంస

ప్రతి వారం నిర్ణీత తేదీల్లో అధికారులతో ముఖ్యమంత్రి టెలి, వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించడం ముదావహమని కేంద్ర పశుసంవర్థక శాఖ అధికారి దేవేంద్ర చౌదరి ప్రశంసించారు. రాష్ట్ర పశుసంవర్థక శాఖ ముఖ్యకార్యదర్శి మన్మోహన్ సింగ్‌తో కలిసి ఆయన టెలికాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. టెలీ, వీడియోకాన్ఫరెన్స్‌ను కేంద్ర ప్రభుత్వం ఒక మోడల్‌గా తీసుకుంటుందని చౌదరి ప్రకటించడంతో సిఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు.