ఆంధ్రప్రదేశ్‌

అభిప్రాయాలు చెప్పండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: రాజధాని వికేంద్రీకరణ చివరి అంకానికి చేరింది. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి సంబంధించి జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ నివేదికలపై హైపవర్ కమిటీ మూడోవిడత సమావేశమై వివిధ అంశాలపై సుదీర్ఘంగా చర్చించింది. సోమవారం విజయవాడ సీఆర్డీఏ కార్యాలయంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్, పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, హోం మంత్రి మేకతోటి సుచరిత, మంత్రులు పేర్ని వెంకట్రామయ్య, కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు, కురసాల కన్నబాబు, ఆదిమూలపు సురేష్‌తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. విశాఖలో పాలనా రాజధాని ఏర్పాటుకు సంబంధించి ఉద్యోగుల తరలింపు, అమరావతి అభివృద్ధి, ల్యాండ్ పూలింగ్ తదితర అంశాలతో పాటు జిల్లాల సమగ్రాభివృద్ధిపై విస్తృతంగా చర్చించింది. గతంలో శ్రీకృష్ణ కమిటీ, శివరామకృష్ణన్ కమిటీలు రాజధానికి ఈ ప్రాంతం అనువైంది కాదని తేల్చి చెప్పాయని, తాజాగా జీఎన్ రావు, బోస్టన్ కమిటీలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తీకరించిన నేపథ్యంలో ప్రాంతాల వారీగా భౌగోళిక, నైసర్గిక స్వరూపాలను దృష్టిలో ఉంచుకుని వికేంద్రీకరణ జరిపితే రాష్ట్ర ప్రగతి సాధ్యపడుతుందనే భావన సమావేశంలో వ్యక్తమైంది. మూడు దఫాలుగా నిర్వహించిన ఈ సమావేశాలు లాంఛన ప్రాయమే అయినప్పటికీ చివరగా రాజధాని తరలింపునకు సంబంధించి రైతుల అభిప్రాయాలను సేకరించాలని నిర్ణయించారు. ఈ నెల 17వ తేదీలోగా ఈ మెయిల్ ద్వారా సీఆర్డీఏ వెబ్‌సైట్‌కు రైతుల నుంచి అభిప్రాయ సేకరణ జరపాలని సమావేశం నిర్ణయించింది. సమావేశం
వివరాలను మంత్రి పేర్ని నాని మీడియాకు వివరించారు. సమావేశంలో జిల్లాల వారీగా అభివృద్ధిపై సమగ్రంగా చర్చించామని చెప్పారు. ప్రభుత్వానికి అమరావతి ప్రాంత రైతాంగం ఏం చెప్పదలచుకున్నదీ ఈనెల 17వ తేదీ సాయంత్రం 5 గంటల లోగా వ్యక్తిగతంగా లేదా పోస్టు ద్వారా, ఈ మెయిల్ ద్వారా సీఆర్డీఏ కమిషనర్‌కు సూచనలు, సందేహాలు నివేదించాలని కోరారు. ప్రతి సమావేశంలో రైతుల గురించి చర్చిస్తున్నామని వ్యిక్తిగతంగా రైతులతో కూడా సంప్రతింపులు జరుగుతున్నాయని తెలిపారు. రాజధాని రైతులు చాలా మంది ఇప్పటికే మంత్రులను కలుసుకుని వారి సమస్యలను వివరిస్తున్నట్లు చెప్పారు. రాజకీయం కోసం ఈ అంశాన్ని ఉపయోగించు కునే వారికి తప్ప అందరికీ న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంలో రైతులు కాని వారిని తీసుకువచ్చి ఉద్యమాల పేరుతో అలజడి సృష్టిస్తున్నారని మండిపడ్డారు. వాస్తవ పరిస్థితి ఏంటో రైతాంగానికి ఇప్పటికే అర్థమైందని రాజకీయంగా ప్రేరేపణ పొంది సానుభూతి పొందాలను కుంటున్న వారు పథకం ప్రకారం పోలీసులను రెచ్చకొట్టే విధంగా ఉద్రిక్త పరిస్థితులు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఏ వర్గానికి అన్యాయం చేయదని స్పష్టం చేశారు.
వ్యవస్థలను కించపరచద్దు: మంత్రి కన్నబాబు
రాజధానిలో భూములిచ్చిన రైతులది ఓ ఉద్యమమైతే, ప్రతిపక్షనేత చంద్రబాబు మరో ఉద్యమంతో పక్కదారి పట్టిస్తున్నారని మంత్రి కన్నబాబు విమర్శించారు. రైతుల పక్షాన ఉన్నట్టు నటిస్తూ వ్యవస్థలను కించపరచటం ద్వారా రెచ్చకొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పండుగపూట ప్రజల్ని పక్కదారి పట్టించ వద్దని, రైతు కుటుంబాలను అయోమయానికి గురిచేయవద్దని హితవు పలికారు. చంద్రబాబుకు బాధ కలిగితే ఎవరూ పండుగ చేసుకోరాదనే దుర్బుద్ధితోనే ఆజ్యం పోస్తున్నారని మండిపడ్డారు. ప్రాంతీయ భేదం చూపుతూ డీజీపీ గౌతం సవాంగ్‌ను సైతం అవమానిస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని ఖండించారు.
మచిలీపట్నంను సీఆర్డీఏ నుంచి మినహాయించాలి: మంత్రి పేర్ని
మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ ప్రాంతాన్ని సీఆర్డీఏ పరిధి నుంచి మినహాయించి మచిలీపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) పరిధిరోకి తేవాలని సమాచారశాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య.. హైపవర్ కమిటీ సమావేశంలో ప్రతిపాదించారు. ఈ ప్రాంతాన్ని గత ప్రభుత్వం సీఆర్డీఏ పరిధిలో చేర్చి వ్యవసాయం చేసుకోవాలని, వ్యాపారం చేసుకోవాలంటే అమరావతి వచ్చి చేసుకోవాలంటూ గందరగోళం సృష్టించిందని ఆరోపించారు. పోర్టు నిర్మిస్తామని చెప్పిన ప్రతిపక్షనేత చంద్రబాబు ఏమీ చేయలేకపోయారని విమర్శించారు. మచిలీపట్నం పోర్టు త్వరితగతిన చేపట్టాలని, ఎయిర్‌పోర్టు, హైవే, రైల్వేస్టేషన్, ఎగుమతులు దిగుమతులను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ, ఆక్వా పరిశ్రమలు ఈ ప్రాంతంలో ఏర్పాటుచేసే విషయాన్ని పరిశీలించాలని కోరారు. మరో మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా ప్రభుత్వం ముందుకు వెళుతుందని స్పష్టం చేశారు. ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన రాష్ట్రం తిరిగి విడిపోకుండా అంతా కలిసి ఉండాలనే భావన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
'చిత్రం...హైపవర్ కమిటీ సమావేశంలో పాల్గొన్న మంత్రులు బుగ్గన, పిల్లి, బొత్స