ఆంధ్రప్రదేశ్‌

రైతులకిచ్చే గౌరవమే సంక్రాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: భోగిమంటలు..రంగవల్లులు..హరిదాసు కీర్తనలు.. గంగిరెద్దుల ఆటలు..పచ్చని పైర్లతో గ్రామాలు కళకళలాడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆకాంక్షించారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబం ఆనందంగా గడపాలని అభిలషించారు. సంక్రాంతిని పురస్కరించుకుని సోమవారం రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుటుందనే మాటకు కట్టుబడి, దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ కనివినీ ఎరుగని విధంగా గత 7 నెలల్లో రైతాంగ సంక్షేమానికి, గ్రామాల అభివృద్ధికి శ్రమించామని, ఇకపై ఇదే విధానాలను కొనసాగిస్తామని స్పష్టంచేశారు. మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మన సంస్కృతి, సంప్రదాయాలు, సొంత గ్రామాల మీద మమకారానికి, రైతులకిచ్చే గౌరవానికి సంక్రాంతి ప్రతీక అని అభివర్ణించారు.

'చిత్రం...ముఖ్యమంత్రి జగన్ శుభాకాంక్షలు