ఆంధ్రప్రదేశ్‌

జగన్ ప్రభుత్వానికి ఏపీ అర్చక సమాఖ్య కృతజ్ఞతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 16: నవరత్నాల అమలులో భాగంగా పేదల గృహ అవసరాలకు ఆలయ భూములను సేకరించవద్దని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీచేయడం పట్ల ఆంధ్రప్రదేశ్ అర్చక సమాఖ్య స్వాగతించింది. ఈ మేరకు సమాఖ్య ప్రధాన కార్యదర్శి అగ్నిహోత్రం ఆత్రేయ బాబు, కార్యనిర్వాహక కార్యదర్శి పెద్దింటి రాంబాబు మాట్లాడుతూ, తప్పనిసరి పరిస్థితుల్లో సాగునీటి ప్రాజెక్టులు, రహదార్ల విస్తరణ పథకాలను సేకరిస్తూ సమానమైన భూమిని ఆలయాలకు, అర్చకులకు ఇవ్వాలన్నారు.దేవాలయ భూములను సేకరించాలని కలెక్టర్లు ప్రతిపాదనలు సిద్ధం చేశారని, కాని అర్చక సమాఖ్య చేసిన విజ్ఞప్తిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించారన్నారు. గత ఏడాది సెప్టెంబర్ 27వ తేదీన తాము సీఎం జగన్‌ను కలిసి ఆలయ భూములను సేకరించరాదని కోరినట్లు చెప్పారు. విశాఖ శారదా పీఠాధిపతులు స్వామి స్వరూపానందేద్ర స్వామి కూడా ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఆలయ భూముల పరిరక్షణలో భాగంగా వివిధ ప్రభుత్వ పథకాలకు ఆలయ భూములు అర్చక సర్వీసు మాన్యాలు తీసుకోరాదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు.