ఆంధ్రప్రదేశ్‌

నేడు పల్స్‌పోలియో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం జాతీయ రోగనిరోధక దినోత్సవం (ఎన్‌ఐడీ) జరుపుకుంటున్నామని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మిషన్ డైరెక్టర్ వీ గీతాప్రసాద్ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ముఖ్యమంత్రి నివాసంలో ఆదివారం ఉదయం 10.45 గంటలకు లాంఛనంగా పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 52.27 లక్షల మంది పిల్లలకు పోలియో వ్యాక్సిన్ వేస్తారన్నారు. ఇందుకోసం 1.49 లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలు, వలంటీర్ల ఆధ్వర్యంలో 37,493 పోలియో బూత్‌లను ఏర్పాటు చేశామన్నారు. ప్రయాణంలో ఉండే వారి కోసం 1354 మొబైల్ బృందాలను బస్టాండ్‌లు, రైల్వేస్టేషన్‌లు, ముఖ్య కూడళ్లలో అందుబాటులో ఉంచామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న పల్స్ పోలియో కార్యక్రమంలో 2700 మంది జిల్లా స్థాయి అధికారులు, రాష్ట్ర స్థాయిలో 13 మంది ఉన్నత స్థాయి అధికారులు ప్రత్యక్ష పర్యవేక్షణ చేస్తారన్నారు. 19వ తేదీ వ్యాక్సిన్ తీసుకోలేకపోయిన పిల్లల కోసం 20 నుండి 22వ తేదీ వరకు ఇంటింటికీ సిబ్బంది తిరిగి పోలియో చుక్కలు వేస్తారని శనివారం ఒక ప్రకటనలో గీతాప్రసాద్ తెలిపారు.