ఆంధ్రప్రదేశ్‌

నిబంధనలు పాటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: గత ఏడాది సెప్టెంబర్ 15న గోదావరి నదిలో జరిగిన పడవ ప్రమాదం నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిలిపివేసిన పర్యాటక బోట్‌లను తిరిగి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకువస్తున్నామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి (అవంతి) శ్రీనివాసరావు
వెల్లడించారు. శనివారం విజయవాడ పున్నమిఘాట్‌లో పర్యాటక బోట్‌లను మంత్రి శ్రీనివాస్ పునఃప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఏడాది సెప్టెంబర్ 15న గోదావరి నదిలో దురదృష్టకరమైన పడవ ప్రమాదం జరిగిందన్నారు. సంఘటన జరిగిన వెంటనే సెప్టెంబర్ 16న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాద ప్రాంతాన్ని సందర్శించడం, బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలపడంతోపాటు పడవ ప్రమాదంపై సమీక్షించారన్నారు. సురక్షితమైన విధానాలకు, భద్రతకు, వౌలిక వసతులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి స్పష్టం చేసారన్నారు. అందుకు సంబంధించి నియమ నిబంధనలను, రూపొందించేందుకు ఆరుగురుతో ఉన్నత స్థాయి అధికారుల బృందాన్ని ఏర్పాటు చేశారన్నారు. కాకినాడ పోర్టు పరిధిలో 19, మచిలీపట్నం పోర్టు పరిధిలో 90 స్పీడ్ బోట్‌లు ఉన్నాయన్నారు. వాటిలో 26 బోట్‌లను పరిశీలించి అధికారుల బృందం తగిన సిఫార్సులు చేసిందన్నారు. ఇందుకోసం గోవాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వాటర్ స్పోర్ట్స్ వారి ఆధ్వర్యంలో సిఫార్సులను పరిగణన లోకి తీసుకుని, అందుకు అనుగుణంగానే అనుమతులు ఇస్తామన్నారు. భవానీ ఐల్యాండ్ ప్రాంతాన్ని కూడా మరమ్మతులు చేసి మరో వారం రోజుల్లో పర్యాటకులకు అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ పున్నమిఘాట్ నుండి భవానీ ఐల్యాండ్‌కు త్వరలోనే బోటింగ్ అందుబాటులోనికి తీసుకువస్తామన్నారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ పర్యాటకులకు భద్రత కల్పించాలనే ఏకైక లక్ష్యంతో ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటున్నదన్నారు. నందిగామ ఎమ్మెల్యే జగన్మోహనరావు మాట్లాడుతూ గతంలో జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా పర్యాటకుల భద్రతకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అనంతరం మంత్రి అధికారులతో కలిసి భవానీ ఐల్యాండ్‌ను సందర్శించి అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పర్యాటక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కే ప్రవీణ్‌కుమార్, టూరిజం ఎండీ ప్రవీణ్‌కుమార్, జనరల్ మేనేజర్ సుదర్శనరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సత్యనారాయణ, పలువురు టూరిజం అధికారులు పాల్గొన్నారు.

'చిత్రం... కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్