ఆంధ్రప్రదేశ్‌

అధికారం దక్కిందని మాట తప్పుతారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జనవరి 19: రాజధాని అమరావతికి 30వేల ఎకరాలు అవసరమని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన నాటి ప్రతిపక్ష నేత జగన్ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులంటూ ప్రజల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు చేయడం దుర్మార్గమని మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నేత ధూళిపాళ్ల నరేంద్రకుమార్ అన్నారు. అధికారంలోకి రాకముందు ఒకలా, తీరా అధికారంలోకి వచ్చాక మరోలా జగన్ వైఖరి ఉందని విమర్శించారు. ఆదివారం మంగళగిరి సమీపంలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్‌లో ఎన్‌ఆర్‌సీ, సీఏఏ బిల్లుకు వైసీపీ ఎంపీల ద్వారా జగన్ మద్దతు తెలిపారని, రాష్ట్రంలో మాత్రం 102 జీవో జారీ చేశారన్నారు. ముస్లిం మైనార్టీలకు ద్రోహం చేశారు కనుకనే జగన్ తన పార్టీలోకి ఆయా వర్గాల ప్రజాప్రతినిధులకు ముఖం చాటేస్తున్నారని విమర్శించారు. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యేనాటికి జగన్ ఆస్తులెన్ని, తండ్రి అధికారం నుండి దిగేనాటికి ఆయనకు, ఆయన కుటుంబానికి ఉన్న ఆస్తులపై ధైర్యముంటే హిరంగ చర్చకు రావాలని నరేంద్ర సవాల్ విసిరారు. తామేదైనా తప్పుచేసి ఉంటే ఏ విచారణ జరిపినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. వ్యక్తులు తప్పుచేస్తే వారిపై చర్యలు తీసుకోవాలే గానీ కులాలు, మతాల ప్రస్తావన ఎందుకని ఆయన ప్రశ్నించారు.