ఆంధ్రప్రదేశ్‌

నోటీసులతో ఉద్యమాన్ని ఆపలేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 19: అమరావతిని యథావిధిగా పూర్తిస్థాయి రాజధానిగా కొనసాగిస్తామని ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటించాలని అమరావతి పొలిటికల్ జేఏసీ కన్వీనర్, సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్ డిమాండ్ చేశారు. అమరావతిని రాజధానిగా కొనసాగిస్తామని ప్రభుత్వం ప్రకటించేంత వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని చెప్పారు. పోలీసులను అడ్డుపెట్టుకుని బెదిరిస్తే భయపడేది లేదని, ఎన్ని నోటీసులు ఇచ్చినా సోమవారం ఉదయం ‘చలో అసెంబ్లీ’ కార్యక్రమం నిర్వహించి తీరుతామని స్పష్టం చేశారు. నగరంలోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం దాసరి భవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చలో అసెంబ్లీ ఆందోళన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం అఖిలపక్ష నాయకులకు నోటీసులు పంపుతోందని చెప్పారు. తనకు ఐదు పోలీసు స్టేషన్ల నుంచి నోటీసులు ఇచ్చారని తెలిపారు. రాష్ట్ర ప్రజలంతా అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుతున్నారని, అయినా ప్రభుత్వం పట్టించుకోక పోవడం దుర్మార్గమన్నారు. ప్రజల ఆకాంక్షల మేరకు ఉద్యమిస్తున్న నాయకులకు నోటీసులిచ్చి బెదిరించాలని చూడటం, ఉద్యమాలను అణచివేయాలని ప్రయత్నించటం పాలకుల మూర్ఖత్వానికి నిదర్శనమన్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా సోమవారం ఉదయం 10గంటలకు నగరంలోని ధర్నాచౌక్ నుంచి ప్రదర్శనగా బయలుదేరి చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆయన చెప్పారు. అమరావతిని రాజధానిగా కొనసాగించటంతో పాటు 13 జిల్లాల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రంలో గందరగోళం సృష్టించిన ప్రభుత్వం తక్షణం నిర్ణయాన్ని మార్చుకుని ప్రజల ఆందోళనలకు తెరదించాలని శంకర్ విజ్ఞప్తి చేశారు. విలేఖరుల సమావేశంలో సీపీఐ నగర సహాయ కార్యదర్శి జీ కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.