ఆంధ్రప్రదేశ్‌

తప్పుచేశారు కనుకే సీఎంకు భయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జనవరి 19: రాజధాని మార్పు విషయంలో ముఖ్యమంత్రి జగన్ తప్పు చేశారు కనుకనే ప్రజల్లోకి రావడానికి భయపడుతున్నారని, అందుకే పోలీసుల మోహరింపులో చత్తీస్‌గఢ్‌ను మించిపోయారని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. ఆదివారం మంగళగిరి సమీపంలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రెఫరెండం కోరుతూ విశాఖపట్నంలోని పబ్లిక్ లైబ్రరీలో రాజధాని నిర్ణయంపై జేఏసీ తలపెట్టిన ప్రజాబ్యాలెట్‌ను అడ్డుకుని, షార్ట్‌సర్క్యూట్ పేరిట ప్రజలను భయపెట్టి పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమని ఖండించారు. విజయసాయిరెడ్డి, విశాఖ జాయింట్ కలెక్టర్, డీసీపీ ఆధ్వర్యంలో గయాలీ భూములను కాజేసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. జేసీ ప్రతి శనివారం కోర్టు నిర్వహిస్తూ సెటిల్‌మెంట్ల పేరుతో భూములు కాజేస్తున్నారని దుయ్యబట్టారు. వైఎస్ హయాంలో హైదరాబాద్‌లో అక్రమంగా తీసుకున్న భూముల ధరలను పెంచుకునేందుకే కేసీఆర్‌తో జగన్ చర్చలు జరిపారన్నారు. అమరావతి తరలింపును సమర్థిస్తున్న రాయలసీమ జిల్లాల శాసనసభ్యులంతా జగన్‌కు ఎదురుతిరిగి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి తరలింపును అడ్డుకోవాలని ఉమా సూచించారు.